Ram Charan: మహీతో మగధీర
తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలిసిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

A picture of Ram Charan and Dhoni together is going viral on social media
మన క్రికెటర్స్ కు సినీ నటీనటులకు మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉంటాయి. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కలిసిన ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఎవరి ఫీల్డ్ లో వారే స్టార్లు.. అటువంటి వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులకు కన్నుల పండగగా తోస్తుంది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి మన దేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులున్నారు. క్రికెట్ అన్ని ఫార్మేట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించినా అభిమాన గణం ఏమాత్రం తగ్గలేదు. అందుకు ఉదాహరణే ఐపిఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న ఆదరణ. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబై లో ధోనీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను కలిసి సందడి చేశాడు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్‌చరణ్‌కి గ్లోబల్ స్టార్ గా ఖ్యాతిగాంచాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టిన చెర్రీ ప్రస్తుతం గేమ్ చేంజర్ లో నటిస్తున్నాడు. తాజాగా ఎం.ఎస్.ధోనీని రామ్ చరణ్ ముంబైలో కలిశాడు. దీంతో ఫ్యాన్స్ గతంలో రామ్ చరణ్ ధోనీ కలిసి నటించిన ఒక ప్రకటనను గుర్తు చేసుకుంటున్నారు. సుమారు 13 ఏళ్ల క్రితం అంటే 2009లో ధోని , చరణ్ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించారు. అప్పట్లో ఈ పెప్సి యాడ్ సూపర్ సక్సెస్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ ఒక యాడ్ షూటింగ్ నిమిత్తం ముంబై వెళ్ళాడు. అక్కడే ధోనీని కలవడంతో వీరిద్దరూ కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటిస్తున్నారని.. అందుకే, వీళ్లిద్దరూ కలిశారని టాక్ వినిపిస్తోంది.