ద్వైపాక్షిక సిరీస్ లో అరుదైన ఘనత, వరుణ్ చక్రవర్తి ఆల్ టైమ్ రికార్డ్
టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో పది వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.

టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్ లో పది వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు.ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్, రవి బిష్ణోయ్ పేరిట ఉన్న రికార్డును వరుణ్ తిరగరాశాడు. సౌతాఫ్రికాతో మూడో టీ20లో వరుణ్ చక్రవర్తి 4 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. దీంతో మొత్తంగా ఇప్పటి వరకూ మూడు టీ20ల్లో కలిపి అతడు 10 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో మరో టీ20 ఇంకా మిగిలే ఉంది. ఇంతకుముందు భారత స్పిన్నర్ అశ్విన్ 2016లో శ్రీలంకతో టీ20 సిరీస్ లో 9 వికెట్లు తీశాడు. ఇప్పుడు వరుణ్ ఆ రికార్డును తిరగరాశాడు. గతేడాది రవి బిష్ణోయ్ కూడా ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ లో 9 వికెట్లు తీసుకున్నాడు.