Ayodhya Ram Mandir : రామాయణం సీరియల్ టీమ్‌కు అరుదైన గౌరవం.. అయోధ్య ట్రస్ట్ నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం
అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో కోట్లాదిమంది రామభక్తుల కల సాకారం కానుంది. రేపు అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ( Prana Pratishtha) సంబంధించి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది.

A rare honor for the Ramayanam serial team.. A special invitation received from the Ayodhya Trust
అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవంతో కోట్లాదిమంది రామభక్తుల కల సాకారం కానుంది. రేపు అత్యంత వైభవోపేతంగా బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ( Prana Pratishtha) సంబంధించి అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు యావత్ భారతదేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి దేశంలోని అనేక మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. రాజకీయ, సినీ, టెలివిజన్, వ్యాపార వర్గాలకు చెందిన పలువుకు ప్రముఖులకు ఆహ్వానాలు అందగా, వారంతా అయోధ్యకు తరలి వెళ్తున్నారు.. ఈ క్రమంలోనే 80వ దశకంలో జాతీయ దూరదర్శన్ (National Television)లో ప్రసారమైన రామాలయం సీరియల్ నటీనటులకు కూడా పత్ర్యేక ఆహ్వానాలు అందాయి..
1987- 88 మధ్య ప్రసారమైన రామాలయం సీరియల్.. సాగర్ ఆర్ట్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సీరియల్ ఇప్పటికీ ఓ రికార్డ్. ప్రపంచంలోనే అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన సీరియల్ గా గుర్తింపు పొందింది. ఐదు ఖండాల్లో.. 17 దేశాల్లో.. 20 వేర్వేరు ఛానెళ్లలో ప్రసారమైంది. ఆ రోజుల్లో ఆ సీరియల్ కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాసినట్లు ఎదురు చూసే వారంటే అతిశయోక్తి కాదు.. 82 శాతం వీక్షకులతో ఆ రోజుల్లో రామాయణం రికార్డు సృష్టిచిందంటే.. ఆ సీరియల్‌కు ఎలాంటి క్రేజ్ ఉండేదో అర్థమవుతుంది. ఈ సీరియల్ ను 650 మిలియన్లకు పైగా ప్రేక్షకులు చూసినట్లు బీబీసీ గణాంకాలు తెలిపాయి. అందుకే ఈ ఛానల్ నేషనల్ దూరదర్శన్‌కు కాసుల వర్షం కురిపించింది. ప్రతి ఎపిసోడ్ కు దాదాపు 40 లక్షలు ఆదాయం సంపాదించి పెట్టింది.
రాముడిగా అరుణ్ గోవిల్, సీతగా దీపికా చికాలియా ఆ పాత్రల్లో జీవించారు. సునీల్ లహరి, అరవింద్ త్రివేది, ధారా సింగ్ లు సైతం తమ నటనతో మెప్పించారు. ఈ సీరియల్ కి డైరెక్టర్ రామానంద్ సాగర్ కాగా.. స్వరకర్తగా రవీంద్ర జైన్.. నిర్మాతలుగా రామానంద సాగర్, ఆనంద సాగర్, మోతి సాగర్ వ్యవహరించారు. రాముడి పాత్రలో అరుణ్ గోవిల్‌ను చూసిన ప్రేక్షకులు ఆయన్ను కలియుగ రాముడిగా అభివర్ణించేవారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పట్టేవారు. అంతటి విశిష్ట గుర్తింపు పొందిన రామాయణం సీరియల్ టీమ్‌కు.. ఇప్పుడు అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా మరో అరుదైన గౌరవం దక్కింది. బాల రాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట వేడకులకు అలనాటి రామాయణం సీరియల్ యూనిట్ సభ్యులకు ఆహ్వానం అందింది. ఈ విషయం తెలసుకున్న ఆ తరం ప్రేక్షకులు రామాయణం సీరియల్ టీమ్‌కు మంచి గుర్తింపు లభించిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.