Ayodhya Mandir Prarambotsavam అరుదైన గౌరవం.. అయోధ్య నుంచి చిరు, ప్రభాస్‌కు ఆహ్వానం..
తెలుగు సినిమా రంగంలో చిరంజీవి అండ్ ప్రభాస్ లకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. తమ అధ్బుతమైన నటనతో అగ్ర హీరోలుగా కొనసాగుతు కొన్ని లక్షల మంది అభిమానులని సంపాదించుకున్నారు. పైగా ఈ ఇద్దరిది ఒకే ఊరు.. తాజాగా ఈ ఇద్దరికీ వచ్చిన ఒక ఆహ్వానం ఇరువురి అభిమానులని ఆనందంలో ముంచెత్తుతుంది.

హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముని జన్మ స్థలం అయోధ్య లో మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం శ్రీరామునికి రామ మందిరం నిర్మిస్తుంది. ఈ మేరకు మందిర నిర్మాణా పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. వచ్చే నెల జనవరి 22 న శ్రీ రామ మందిరం ప్రారంభం కాబోతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చిరంజీవి, ప్రభాస్ లు హాజరవుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి చిరు ,ప్రభాస్ లకి ఆహ్వానం అందింది. సోషల్ మీడియాలో ఈ వార్తలు వస్తుండటంతో చిరు అండ్ ప్రభాస్ ఫాన్స్ ఫుల్ ఖుషీతో ఉన్నారు.
ఈ ఇద్దరితో పాటు అమితాబ్, రజనీ కాంత్, యష్, సన్నీడియోల్, రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలి, రోహిత్ శెట్టి లాంటి వాళ్ళు హాజరవుతున్నారు. వీరితో పాటు వివిధ రంగాలకి చెందిన ఎంతో మంది ప్రముఖులు రామ మందిర ప్రారంభోత్సవానికీ హాజరవుతున్నారు. ప్రభాస్ నటించిన సలార్ ప్రస్తుతం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో సరి కొత్త రికార్డులని సృష్టిస్తు ముందుకు దూసుకుపోతుంది. చిరంజీవి ఈ రికార్డులని అధిగమించడానికి తన కొత్త చిత్రం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.