Serial Killer Killed : కెన్యాలో సీరియల్ కిల్లర్.. భార్యతో సహా 42 మంది మహిళలు హతం..
కెన్యా రాజధాని నైరోబీలోని ఓ సీరియల్ కిల్లర్ ఇంట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో నైరోబీ మొత్తం ఉలిక్కిపండింది. కెన్యాలో 42 మంది మహిళ హత్యకు కారణమైన కొల్లిన్స్ జమైసీ కాలుషా (33)ను నైరోబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

A serial killer killed 42 women including his wife in Kenya.
కెన్యా రాజధాని నైరోబీలోని ఓ సీరియల్ కిల్లర్ ఇంట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దీంతో నైరోబీ మొత్తం ఉలిక్కిపండింది. కెన్యాలో 42 మంది మహిళ హత్యకు కారణమైన కొల్లిన్స్ జమైసీ కాలుషా (33)ను నైరోబీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 నుంచి 11 జులై 2024లోపు అతడు 42 మంది మహిళలను వలవేసి లొంగదీసుకొని.. ఆపై హత్య చేశాడు. పోలీసుల సోదాల్లో అతని ఇంట్లో రబ్బరు గ్లౌజులు, సెల్లోటేప్, ప్లాస్టిక్ బ్యాగులు లభ్యమయ్యాయి. వారి మృతదేహాలను ఛిద్రం చేసి సమీపంలో భారీ డంపింగ్ యార్డ్‌లో పడేసేవాడు. మిస్ అయిన మహిళ సోదరి ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. నైరోబీలోని ఒక మురికివాడలో 9 అస్థిపంజరాలు దొరకడంతో ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభమైంది.
ఫోరెన్సిక్ విచారణలో చాలా మృతదేహాల మొండాలు ఉన్నాయని, అయితే తలలు మాత్రం కనిపించలేదని తేలింది. ఒక పూర్తి మృతదేహం మాత్రమే లభ్యమైంది. ఏ మృతదేహంపైనా చూసిన గొంతు నులిమి హత్య చేసిన గుర్తులు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోని డంపింగ్ యార్డులోనే శరీర భాగాలను పడవేయడం గమనార్హం.. దీంతో పోలీసులు వైద్యుల బృదం DNA పరీక్షలు చేయ్యగా.. వారి ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. తాను చంపిన వారిలో తన భార్య కూడా ఉందని అతడు అంగీకరించాడు. మరో వైపు కెన్యా దేశంలో ప్రస్తుతం లింగ ఆధారిత హింస, రాజకీయ గందరగోళం నెలకొంది.