MLC Elections, Wine Bandh : మందుబాబులకు వరుస షాకులు.. రెండు రోజులు రాష్ట్రంలో వైన్స్ బంద్.. ఎందుకో తెలుసా..?
తెలంగాణలో రెండ్రోజుల పాటు వైన్స్ దుకాణాలు, బార్లు అన్ని మూతపడనున్నాయి. తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీన జరగనుంది.
మందుబాబులకు మరో షాక్.. ఈ మధ్య పలు కారణాలతో మద్యం షాపులు వరుసగా మూత బడుతున్నాయి. కాగా ఈ నెలలో ఇది రెండోవ సారి వైన్స్ బంద్ కావడం.. మే 13న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు వైన్ షాపులు మూతబడిన విషయం తెలిసిందే.. తాజా మరో సారి వైన్స్ మూత బడనున్నాయి. ఎందుకంటే..?
మందుబాబులు ఇది మీ కోసం.. తెలంగాణలో సూరీడు సుర్రు మంటున్న.. నడి నెత్తిన రవి నట్యం చేస్తున్నట్లే ఉండు.. గొంతులో సల్లగా అమృతం పడితే తప్ప రోజు గడవాదాయే.. అందులోనే అసలే ఇది వీకెండు.. వారం అంత పని చేసి ఆదివారం నాడు చిల్ అయ్యే సమయం.. సుక్క బడితేనే రాత్రి సుకున్ అన్నట్లుగా మందుబాబుల అంశాలు.. కానీ నేటికి అవి అడిఅశాలే అవుతున్నాయిగా.. ఎందుకో తెలుసా..?
తెలంగాణలో రెండ్రోజుల పాటు వైన్స్ దుకాణాలు, బార్లు అన్ని మూతపడనున్నాయి. తెలంగాణలో వరంగల్-నల్గొండ-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 27వ తేదీన జరగనుంది. శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర పడనుంది. ఈ నేపథ్యంలో వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచి సోమవారం సాయంత్రం 4 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు బంద్ అవుతాయని పేర్కొందని తెలంగాణ సర్కర్. ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో మద్యం షాపులు, బార్లు, వైన్ షాప్స్ బందవుతాయని ఈసీ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే మద్యం దుకాణాలతోపాటు అన్ని కల్లు కంపౌండ్‌లు సైతం 48 గంటల పాటు మూతపడనున్నాయి.