Veerabhadra Rao : విశాఖలో వైసీపీకి దిమ్మదిరిగే షాక్‌.. మరో కీలకనేత రాజీనామా..

వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నియోజకవర్గాల మార్పు, సిట్టింగ్‌లకు టికెట్ల నిరాకరణతో.. ఇక తమకు అవకాశం లేదు అనుకున్న నేతలు.. ఒకరి తర్వాత ఒకరు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఆళ్లతో మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు విశాఖ వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. వైసీపీకి దూరం కానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 2, 2024 | 03:48 PMLast Updated on: Jan 02, 2024 | 3:48 PM

A Shocking Shock For Ycp In Visakha Another Key Leader Resigns

 

వైసీపీకి, ఆ పార్టీ అధినేత జగన్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయ్. నియోజకవర్గాల మార్పు, సిట్టింగ్‌లకు టికెట్ల నిరాకరణతో.. ఇక తమకు అవకాశం లేదు అనుకున్న నేతలు.. ఒకరి తర్వాత ఒకరు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఆళ్లతో మొదలైన రచ్చ.. కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు విశాఖ వైసీపీలో కలకలం చెలరేగింది. దాడి వీరభద్రరావు ఫ్యామిలీ.. వైసీపీకి దూరం కానుంది. జనసేన, టీడీపీ వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. గుడివాడ అమర్నాథ్‌ తో ఉన్న విభేధాలు.. వైసీపీ అధిష్టానం పట్టించుకున్నట్లు కనిపించకపోవడంలాంటి కారణాలతో.. వైసీపీకి దాడి వీరభద్రరావు రాజీనామా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఐతే వైసీపీకి బైబై చెప్పిన తర్వాత.. టీడీపీలో చేరాలా.. జనసేనలో చేరాలా అనే ఆలోచనలో దాడి అండ్ ఫ్యామిలీ ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ ఆహ్వానించారు. దీంతో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారని వినిపిస్తోంది. గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్న దాడి వీరభద్రరావు.. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు.

ఐతే ఫ్యాన్‌ పార్టీలో ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదు. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును.. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్‌కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్‌కు కేటాయించారు. అయితే అక్కడ రత్నాకర్ ఓడిపోయారు. ఆ తర్వాత వారిని పార్టీ పక్కన పెట్టింది. దాడి వీరభద్రరావు కూడా మౌనంగానే ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తన ఉనికిని చాటుకోవాలని దాడి ఫ్యామిలీ ప్రయత్నిస్తోంది. జగన్ తీరుపై అసహనంగా ఉన్న ఆయన.. ఇప్పుడు జనసేనవైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ఓసారి పవన్ కల్యాణ్ దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటి అయి.. సూచనలు, సలహాలు తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పుడు దాదాపు ఖాయం అయింది. దాడి ఫ్యామిలీ పార్టీని వీడడం అంటే.. విశాఖలో అది వైసీపీ పెద్ద షాక్‌గా మారడం ఖాయం.