Golkonda : చారిత్రక కోటకు కొత్త వెలుగులు..
తెలంగాణ చారిత్రకకు చిహ్నం గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించారు.

తెలంగాణ చారిత్రకకు చిహ్నం గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించారు.

గోల్కొండ కోటలో పర్యాటకులు, సందర్శకులకు అవసరమైన ఏర్పాట్లను చేసే కార్యక్రమంలో భాగంగా సౌండ్ అండ్ లైట్ షో, ఇల్యుమినేషన్ కార్యక్రమాలను కేంద్ర సాంస్కృతిక శాఖ చేపట్టింది.


చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులను వెలిగిపోతుంది.

కోట చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా, కాకతీయుల కాలం నుంచి నేటి వరకు మన చారిత్రక వారసత్వాన్ని ప్రతిబింబించేలా కేంద్ర ప్రభుత్వం గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ షోనుం ఏర్పాటు చేసింది.

దీంతో పాటుగా ఇకపై రాత్రిళ్లు కూడా దేదీప్యమానంగా కనిపించేలా ఇల్యుమినేట్ చేసింది.

30 ఏళ్ల నాటి ఈ లైట్ షో స్థానంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన లైట్ షోను ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు.

సౌండ్ షో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల సమయం ఉంటుంది.

అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3డీ మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై-రెజల్యూషన్ ప్రొజెక్టర్లు, లేజర్ లైట్లు, మూవింగ్ హెడ్స్ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.

11వ శతాబ్దం నాటి ఈ గోల్కొండ కోటలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌండ్ అండ్ లైట్ షోను 1993లో ఏర్పాటు చేశారు.

దీన్ని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, రాజ్యసభ ఎంపీ విజయేంద్ర ప్రసాద్ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.


పర్యాటకుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా, రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, కోట చరిత్రను ఆకర్షణీయంగా వివరించేలా అత్యాధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర సర్కారు ఏర్పాటు చేయనుంది.












