Kim Jong Un: కిమ్‌ను వెంటాడుతున్న వింత వ్యాధి.. నియంతకు నూకలు చెల్లినట్లేనా ?

నియంతకు రూపం ఇస్తే తను అన్నట్లుగా బిహేవ్‌ చేస్తున్నాడు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్. దిక్కుమాలిన నిర్ణయాలు, అర్థం లేని చట్టాలు.. హింసించే చట్టాలతో ఆ దేశం జనాలనే కాదు.. ప్రపంచాన్ని కూడా భయపెడుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 1, 2023 | 05:13 PMLast Updated on: Jun 01, 2023 | 5:13 PM

A Strange Disease Haunts Kim

అలాంటి కిమ్‌ను ఓ వ్యాధి వెంటాడుతోంది. తీవ్రమైన నిద్రలేమితో కిమ్ బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ సర్వీస్‌ దీనికి సంబంధించి ఓ అంచనాకు వచ్చింది. నిద్ర లేకపోవడానికి తోడు.. కిమ్‌ విపరీతంగా బరువు పెరిగినట్లు గుర్తించారు. ఆల్కహాల్‌, నికోటిన్‌ వ్యసనాల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందని.. దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ అధికారులు అంచనాకు వచ్చారు.

ఈ సమస్యకు చికిత్స కోసం కిమ్‌ లోతైన వైద్య సమాచారం సేకరించే పనిలో పడ్డట్లు గుర్తించారు. ప్రస్తుతం కిమ్ బరువు 140కిలోల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి కిమ్‌… మద్యానికి, సిగరెట్లకు బానిసగా మారినట్లు గతంలోనే అమెరికాకు చెందిన ఓ పత్రిక.. భారీ కథనం ప్రచురించింది. ఎప్పటిలానే ఇది జస్ట్ ప్రచారం అని అంతా కొట్టిపారేశారు. ఐతే ఇదే నిజం అని ఇప్పుడు తేలింది. కిమ్‌లో నిద్రలేమి సమస్యలు తలెత్తడంతో.. అతని కంటి కింద తీవ్రమైన బ్లాక్‌ సర్కిల్స్ కనిపిస్తున్నాయ్‌ అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదిక చెప్తోంది.

నిజానికి కిమ్ ఆరోగ్యం బాగుండడం లేదని.. కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఎప్పుడో కాని మీడియాకు కనిపించే కిమ్‌.. ఒక్కోసారి ఒక్కోలా అనిపిస్తున్నారు. దీంతో ప్రాణాలు తీసే వ్యాధితో కిమ్ బాధపడుతున్నారని ప్రపంచం అంతా భావించింది. ఐతే ఇప్పుడు దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ నివేదికతో ఇప్పుడు మరో కొత్త చర్చ మొదలైంది.