Dog Attack : వీధి కుక్కల దాడి.. చిన్నారి మృతి..
హైదరాబాద్ లో మరో విషాదం చోటుచేసుకుంది. నగరంలో మరో చిన్నారిని బలిగొన్న కుక్క. షేక్ పేట్ లో పరిధిలోని వినోభా నగర్ లో విషాదం జరిగింది. ఈ నెల 8న గుడిసెలో పడుకోబెట్టి.. పనుల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఆ 5 నెలల శిశువుపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు.. దీంతో చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

A stray dog killed another child in Hyderabad. The incident took place in Shakepet, Hyderabad
హైదరాబాద్ (Hyderabad) లో మరో విషాదం చోటుచేసుకుంది. నగరంలో మరో చిన్నారిని బలిగొన్న కుక్క. షేక్ పేట్ ( Sheikh Pate) లో పరిధిలోని వినోభా నగర్ లో విషాదం జరిగింది. ఈ నెల 8న గుడిసెలో పడుకోబెట్టి.. పనుల కోసం తల్లిదండ్రులు బయటకు వెళ్లగా.. ఆ 5 నెలల శిశువుపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఐదు నెలల పసికందు.. దీంతో చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 17 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృత్యువుతో పోరా.. చివరికి బాలుడు మృతి చెందాడు. చివరి వరకు వైద్యులు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. వీధి కుక్కలు చిన్నారులపై దాడులు చేస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 8న గుడిసెలో తమ చిన్నారిని పడుకోబెట్టి పనుల నిమిత్తం బయటకు వెళ్లి.. వారు తిరిగి ఇంటికొచ్చి చూడగా కుక్కల దాడిలో తీవ్ర గాయాలతో ఏడుస్తూ కనిపించాడు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యుల సూచన మేరకు నిలోఫర్ కు తరలించారు. అక్కడ సిబ్బంది సూచనలతో ఉస్మానియాకు తరలించారు.