Mediterranean Sea : మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం.. 61 మంది దుర్మరణం..
మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులతో జువారా నుంచి యూరప్ కు వయలుదేరిన బోటు లిబియా తీరంలో బోల్తా పడటంతో 61 మంది దుర్మరణం చెందారు.

A terrible accident in the Mediterranean Sea.. 61 people died..
మధ్యధరా సముద్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆఫ్రికా దేశాల నుంచి వలసదారులతో జువారా నుంచి యూరప్ కు వయలుదేరిన బోటు లిబియా తీరంలో బోల్తా పడటంతో 61 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో బోటులో మహిళలు, చిన్నారులు సహా మొత్తం 86 మంది ఉన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (IOM) వెల్లడించింది. ఈ ప్రమాదంలో 25 మందిని రెస్క్యూ టీమ్స్ సురక్షితంగా బయటికి తీసుకొచ్చాయి. వారిని లిబియా డిటెన్షన్ సెంటర్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో ఈ ఏడాదిలో దాదాపు 2,200 మంది ఇలా ప్రాణాలు కోల్పాయినట్లు IOM అంచనా వేసింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. లిబియా పశ్చిమ తీరంలోని జువారా పట్టణ సమీపంలో బలమైన అలల తాకిడికి పడవ కొట్టుకుపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు వెల్లడించారు.