Uttarakhand : ఉత్తరాఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 200 అడుగుల లోయలో పడ్డ వాహనం
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) .. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో హల్ద్వానీ నుంచి ఓఖల్కండ బ్లాక్.. పూదపూరి గ్రామానికి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది.

A terrible road accident in Uttarakhand.. a vehicle fell into a 200 feet valley
ఉత్తరాఖండ్ (Uttarakhand) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) .. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనిటాల్ జిల్లాలో హల్ద్వానీ నుంచి ఓఖల్కండ బ్లాక్.. పూదపూరి గ్రామానికి వెళుతున్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో వాహనం 200 అడుగుల లోయలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
ప్రయాణ సమయంలో వాహనంలో మొత్తం 12 మంది ఉన్నట్లు సమచారం.. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వారికి వెంటనే ప్రథమ చికిత్స అందించారు. కాగా మృతుల్లో మహిళలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుల్లో పుర్పూరికి చెందిన భువన్ చంద్ర భట్ (30 ఏళ్లు), మమత (19 ఏళ్లు), భద్రకోట్ నివాసి ఉమేష్ పర్గై (38 ఏళ్లు) ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మహేశ్ చంద్ర, ఆయన భార్య పార్వతీదేవి, కుమార్తె కవిత మృతి చెందారు. మృతులందరు పూర్పురి కి చెందిన వారుగా గుర్తింపు.. ఈ ఘోర ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణం అని BRO (Border Roads Organisation) వెల్లడించింది. ఈ ఘటనలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.