Navi Mumbai : నవీ ముంబైలో కూలిన మూడు అంతస్తుల భవనం..
మహారాష్ట్రలోని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో శనివారం మూడు అంతస్తుల భవనం(Building Collapse) కుప్పకూలిపోయింది. ఆ బిల్డింగ్ శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు పోలీసులు, NDRF బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఈ స్క్యూలో ఇద్దర్ని రక్షించినట్లు వెల్లడించారు. మరో ఇద్దరు శిథిలాల కింద ఉండి ఉంటారని నవీ ముంబై డిప్యూటీ ఫైర్ ఆఫీసర్ పురుషోత్తమ్ జాదవ్ తెలిపారు. మరో వైపు నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాస్ షిండే మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ భవనంలో 24కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఈ ప్రమాదం నుంచి ఇద్దరు వ్యక్తులను రక్షించాం.. ఇంకా చాలామంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు తెలుస్తుందన్నారు. ఈ భవనం ఇవాళ తెల్లవారుజామున 4.50 నిమిషాలకు తమ బిల్డింగ్ కూలినట్లు ఫోన్ వచ్చిందని ఆయన వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని నవీ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కైలాశ్ షిండే తెలిపారు.