Raviteja: రవితేజ యష్ మధ్య సోషల్ వార్
రవితేజ, యశ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్‌లో యశ్ గురించి మాస్ రాజా అన్న ఒక్క మాట ట్రోల్ అవుతోంది. మా హీరోను అంత మాట అంటావా? అంటూ యశ్ ఫ్యాన్స్ రవితేజాపై మండిపడుతున్నాడు. ఇంతకీ రవితేజా ఏమాన్నాడు?

A war is going on on social media over Ravi Teja's comments about Yash as part of Tiger Nageshwar Rao's movie promotion.
రవితేజ, యశ్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైంది. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్‌లో యశ్ గురించి మాస్ రాజా అన్న ఒక్క మాట ట్రోల్ అవుతోంది. మా హీరోను అంత మాట అంటావా? అంటూ యశ్ ఫ్యాన్స్ రవితేజాపై మండిపడుతున్నాడు. ఇంతకీ రవితేజా ఏమాన్నాడు? ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో రవితేజ టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటికే రెండుసార్లు ముంబాయి వెళ్లి సినిమాను ప్రమోట్ చేశాడు. ఈక్రమంలో ఓ ఇంటర్వ్యూలో స్టార్స్ గురించి అడిగితే.. రామ్‌చరణ్, విజయ్ డ్యాన్స్ ఇష్టమన్నాడు. రాజమౌళి ఒక విజన్ అని చెప్పాడు. ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అన్నాడు. అయితే. యశ్ గురించి మాట్లాడింది ట్రోల్స్‌కు గురైంది.
కెజిఎఫ్ దొరకడం యశ్ అదృష్టమన్నాడు రవితేజ. యశ్ ఫ్యాన్స్ మాత్రం ఒప్పుకోవడం లేదు. అదృష్టం అంటే తమ హీరోను కించపరిచినట్టే అంటున్నారు. రవితేజలా ఎలాంటి అండాదండా లేకుండా కష్టపడి పైకి వచ్చిన యశ్‌ను ఇలా అనడం సరికాదంటున్నారు. బన్నీకి పుష్పలా.. రామ్‌చరణ్‌కు రంగస్థలంలా యశ్‌కు కెజిఎఫ్ అలా అన్న కాంటెస్ట్‌లో అన్నాడని రవితేజ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.
మరి రవితేజ యశ్ గురించి ఏ కాంటెస్ట్‌లో అన్నాడో వివరణ ఇవ్వాల్సి వుంది. టైగర్ నాగేశ్వరరావు 20న రిలీజ్ అవుతోంది. రవితేజ అన్న మాటలు కన్నడపై ఎఫెక్ట్ పడుతుందా? ఈలోగా రవితేజ క్లారిఫై ఇస్తే.. అంతా సమసిపోతుందేమో చూడాలి మరి. రవితేజ ముంబాయ్‌లో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడిపేశాడు. శిల్పాశెట్టి జడ్జిగా వున్న ఓ షోకు వెళ్లి శిల్పాతో డ్యాన్స్ వేసిన వీడియో నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.