కివీస్ చేతిలో వైట్ వాష్ రహానే ట్వీట్ వైరల్
సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఘోరపరాజయం పాలైన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. స్పిన్ ఆడడంలో ఎందుకు తడబడుతున్నారన్నది ఇక్కడ చర్చనీయాంశైంది.

సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 0-3తో ఘోరపరాజయం పాలైన టీమిండియా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. స్పిన్ ఆడడంలో ఎందుకు తడబడుతున్నారన్నది ఇక్కడ చర్చనీయాంశైంది. ఈ నేపథ్యంలో టీమిండియా వెటరన్ ప్లేయర్ అజింక్య రహానే షేర్ చేసిన ఓ వీడియా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారత్ ఓటమి అనంతరం తను వర్కౌట్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో రహానే షేర్ చేశాడు. అందుకు హద్దులను దాటి ముందుకు వెళ్లండి అంటూ ఆర్ధం వచ్చేలా కాప్షన్ ఇచ్చాడు. కాగా రహానే భారత జట్టులో చోటు కోల్పోయి దాదాపు ఏడాదిపైనే అయింది. రహానే జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటకి తన ఫిట్‌నెస్‌ను ఏ మాత్రం కోల్పోలేదు. రంజీ సీజన్ లో ముంబైకి కెప్టెన్‌గా వహరిస్తున్నాడు.