Woman Sale To Husband: కట్టుకున్న భర్తను కాసులకు బేరం పెట్టిన భార్య..!
సినిమా తరహా సన్నివేశం మన సమాజంలో తాజాగా చోటు చేసుకుంది. ఒక ఇల్లాలు కట్టుకున్న భర్తను మరో స్త్రీకి రూ. 5 లక్షలకు విక్రయించింది. అతగాడిని కొనుక్కునేందుకు సిద్దమైంది మరో మహిళ. ఈ కథేంటో ఇప్పుడు చూద్దాం.

A wife who sold her husband to another woman for money in Karnataka
1990లలో శుభలగ్నం పేరుతో ఒక సినిమా విడుదలైంది. విభిన్న కథాంశంతో తెరకెక్కి అందరికీ ఆలోచింపజేసింది. అందులో భార్య తన భర్తను ఇంకొక స్త్రీకి కోటి రూపాయలకు విక్రయిస్తుంది. ఈ చిత్రంలో సన్నివేశానికి తగ్గట్టుగా పాటల రచయిత వేటూరి ఒక అద్భుతమైన పాటను కూడా అందించారు. లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక అని. నేటికీ ఈ ఒక్క వాక్యం సాహిత్య ప్రియులు చాలా మందిని కట్టిపడేస్తుంది. తాజాగా ఇలాంటి సంఘటనే కర్ణాటకలో చోటు చేసుకుంది. తన మెడలో ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అని అగ్నిసాక్షిగా చేసుకున్న వివాహ ధర్మాన్ని అదే మంటల్లో కలిపేసింది. సొంత భర్తను ఇంకొక స్త్రీకి కేవలం రూ. 5 లక్షలకు అమ్మేసింది.
కర్ణాటకలోని మాండ్య ప్రాంతంలో నివసించే ఒక మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నరు భర్త. ఈ విషయాన్ని గమనించిన భార్య.. ఒకరోజు వారిద్దరూ పడక గదిలో ఉన్నప్పుడు నేరుగా వెళ్లి నిలదీసింది. ఇలా ఇరువురు మహిళలకు తీవ్రమైన వాగ్వాదం జరిగింది. చివరకు వీరి విషయం గ్రామ పంచాయితీకి చేరింది. వివాహిత భర్త.. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళ వద్ద రూ. 5 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ డబ్బులను తిరిగి చెల్లించి నీ భర్తను విడిపించుకు వెళ్ళమని సూచించింది. దీనికి సదరు గృహిణి నీ దగ్గరు తీసుకున్న అప్పు చెల్లించడం కాదు నీవే నాకు మనోవర్తి కింద రూ. 5 లక్షలు చెల్లించి నా భర్తను నీవే ఉంచుకోవాలని తెలిపింది. ఆ నగదును ఇచ్చేందుకు సిద్దమైన మహిళ ఒక నెల రోజులు గడువు కోరింది. అందుకు ఆ ఇల్లాలు అంగీకరించారు. వీరిద్దరి మధ్య జరిగిన పంచాయితీకి గ్రామస్తులు నివ్వెరపోయారు.
T.V.SRIKAR