Medical Miracle : చనిపోయిన భర్త వీర్యంతో తల్లి అయిన మహిళ
సృష్టికి ప్రతిసృష్టి క్రియేట్ చేయడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దీనికోసం శతాబ్దాలుగా సాధన సాగిస్తున్నాడు. వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలా కనిపెట్టిందే ఐవీఎఫ్ విధానం.
సృష్టికి ప్రతిసృష్టి క్రియేట్ చేయడానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. దీనికోసం శతాబ్దాలుగా సాధన సాగిస్తున్నాడు. వినూత్న ప్రయోగాలు చేస్తున్నాడు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలా కనిపెట్టిందే ఐవీఎఫ్ విధానం. పిల్లలు లేని తల్లిదండ్రులకు ఈ విధానం ఒక వరం. దీని గురించి ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. చనిపోయిన భర్త వీర్యంతో ఓ మహిళ తల్లి అయింది. ఈ ఘటనపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్‌లో జరిగింది ఈ ఘటన. భర్త చనిపోయిన రెండేళ్లకు ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. అది కూడా ఐవీఎఫ్ పద్ధతిలో. వైద్య రంగంలో అరుదైన రికార్డు అని డాక్టర్లు చెప్తున్నారు. సంగీత అనే మహిళ.. ఉత్తర పరగణాల్లోని నైహతిలో తన తల్లిదండ్రులతో ఉండేది. ఆమెకు 27ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు మురారైకి చెందిన అరుణ్ ప్రసాద్‌తో పెళ్లి జరిగింది. పెళ్లి అయినప్పటి నుంచి ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి సంతానం కలగలేదు.
అదే టైంలో రెండేళ్ల క్రితం ఆమె భర్త కరోనాతో మరణించాడు. భర్త దూరమయ్యాడనే బాధతోపాటు సంతానం కలగలేదనే వేదన.. ఆమెకు తీరని శోకాన్ని మిగిల్చింది. భర్త చనిపోకముందే ఆయన వీర్యాన్ని కోల్‌కతాలోని ఓ ల్యాబ్‌లో భద్రపరిచారు. తల్లి కావాలనుకున్న తన కోరికను.. ఆమె డాక్టర్లకు చెప్పడంతో.. ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ టెక్నాలజీ ద్వారా.. రామ్‌పూర్ హట్ మెడికల్ కాలేజీలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. భద్రపరిచిన అరుణ్ వీర్యాన్ని సంగీత అండంలోకి ప్రవేశపెట్టడంతో గర్భవతి అయ్యారు. డిసెంబర్ 12న మగబిడ్డకు జన్మనిచ్చారు. అలా తన కలను నిజం చేసుకున్న ఆ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సాధించింది.