Aadhaar: మీ ఆధార్ వివరాలు ఇతరులు దొంగలించకుండా లాక్ / అన్ లాక్ చేసుకోండిలా..

ఆధార్ లాకింగ్, అన్ లాకింగ్ విధానం గురించి మీకు తెలుసా..? ప్రతి పౌరుని భద్రతను దృష్టిలో ఉంచుకొని దీనిని రూపొందించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 09:01 AMLast Updated on: Aug 31, 2023 | 10:45 AM

Aadhaar Card Has Introduced Biometric Lock And Unlock System

ప్రస్తుత సమాజంలో మన సెల్ ఫోన్ సిమ్ కార్డ్ మొదలు బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ వరకూ అన్నింటికీ ఆధారే ప్రదాన ఆధారం. ఇక ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల విషయంలో అయితే దీని వివరాల సేకరణ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎవరికి పడితే వాళ్ల కి ఆధార్ వెరిఫికేషన్ కోసం మన వ్యక్తిగత వివరాలతోపాటూ వేలిముద్రలు కూడా వేస్తూ ఉంటాం. దీనిని అదునుగా భావించి కొందరు సైబర్ నేరగాళ్లు నగదును, వివరాలను దొంగలించి రకరకాల మోసాలకు పాల్పడుతూ ఉంటారు. అందులో ఆన్లైన్ మోసాలే అధికంగా ఉంటాయి. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. దీనిని ఆధార్ బయోమెట్రిక్ లాక్ / అన్ లాక్ అంటారు. వీటి ద్వారా మీ ఆధార్ వివరాలు లాక్ / అన్ లాక్ చేసినప్పటికీ ఓటీపీ సంబంధిత లావాదేవీల్లో ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలుగవు. ఇది కేవలం ఇతరులు మన వివరాలను తస్కరించకుండా ఉండేందుకు ఉపయోగపడే విధానం. దీనిని ఎలా చేసుకోవాలో చూద్దాం.

ఆధార్ బయోమెట్రిక్ లాక్..

  • ఆధార్ సంబంధిత పోర్టల్ లో వెళ్లాలి
  • మన ఆధార్ నంబర్ నమోదు చేసి దానికి లింక్ అయి ఉన్న ఫోన్ నంబర్ కి వచ్చే ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్ పై బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ అనే రెండు ఆఫ్షన్లు కనిపిస్తాయి.
  • ఒక్కో ఆఫ్షన్ ఎలా ఉపయోగపడుతుందో పూర్తి వివరాలు కూడా అందులో పొందుపరిచి ఉంటారు.
  • వీటి గురించి చదివిన తరువాత నెక్స్ట్ అనే ఆఫ్షన్ పై క్లిక్ చేయాలి.
  • ప్లీజ్ సెలెక్ట్ టు లాక్ అనే అక్షరాలు కనిపిస్తాయి.
  • దీని కిందే టర్మ్ బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ ను సెలెక్ట్ చేస్తే టిక్ మార్క్ పడుతుంది.
  • ఇలా చేసిన వెంటనే మీ బయోమెట్రిక్ లాక్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయింది అని వస్తుంది.

అన్ లాక్ చేసే విధానం..

  • ఆధార్ పోర్టల్ లో పైన చెప్పిన విధంగా ఆధార్ నంబర్ తో లాగిన్ అవ్వాలి
  • మళ్లీ స్క్రీన్ పై లాక్ / అన్ లాక్ ఆఫ్షన్ కనిపిస్తుంది
  • లాగిన్ అవ్వగానే మీ ఆధార్ బయోమెట్రిక్ ఒకవేళ లాక్ అయి ఉంటే ఎరుపు రంగులో కనిపిస్తుంది.
  • అలా కాకుండా అన్ లాక్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ సెలెక్ట్ టు అన్ లాక్ ను ఎంచుకోవాలి
  • అప్పుడు అన్ లాక్ శాశ్వతంగానా.. తాత్కాలికంగానా అనే రెండు ఆఫ్షన్లు కనిపిస్తాయి
  • వాటిలో ఏదో ఒక దానిని ఎంచుకుని నెక్స్ట్ అనే దానిపై క్లిక్ చేసి ముందుకు సాగాలి
  • వెంటనే మీ ఆధార్ బయోమెట్రిక్ విజయవంతంగా అన్ లాక్ చేయబడింది అని సూచిస్తుంది
  • ఇందులో తాత్కాలికంగా అనే ఆఫ్షన్ ను ఎంచుకున్నట్లయితే మీ ఆధార్ బయోమెట్రిక్ కేవలం 10 నిమిషాలు మాత్రమే అన్ లాక్ లో ఉంటుంది. ఆ తరువాత ఆటోమేటిక్ గా తిరిగి లాక్ అవుతుంది.

T.V.SRIKAR