UPI Payments: ఆధార్ ఉంటే చాలు.. యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు.. గూగుల్ పే ఫీచర్ గురించి మీకు తెలుసా..?

యూపీఐ లావాదేవీలు ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి. చిన్న కొట్టు మొదలు ఆకలిని తీర్చే ఫుడ్డు వరకూ అన్ని పేమెంట్లను యూపీఐ ద్వారానే చేస్తున్నాము. అందుకే గూగుల్ పే ఒక సరికొత్త ఫీచర్ ను ప్రవేశపెట్టింది. అదే ఆధార్ బేస్డ్ యూపీఐ చెల్లింపులు అనమాట. వీటిని ఎలా ఉపయోగించుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2023 | 04:43 PMLast Updated on: Jun 07, 2023 | 4:43 PM

Aadhar Card Based Upi Payments

సాధారణంగా మనం అకౌంట్ ఓపెనింగ్ మొదలు ఏవైనా బ్యాంక్ వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే ఆధార్ తప్పనిసరిగా తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల గతంలో ఎన్ని లాభాలున్నాయో లేవో తెలియదుకానీ.. ఇప్పుడు మాత్రం ఆధార్ యూపీఐ చెల్లింపులు చేసేందుకు ఉపయోగపడుతుంది. తాజాగా ఈవిషయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ సంస్థతో గూగుల్ లింక్ అయ్యి వినియోగదారునికి మరింత సౌకర్యవంతంగా యూపీఐ లావాదేవీలు జరిగేందుకు ప్రణాళికలు రచించింది.

ఇలా చెల్లింపులు చేసుకోదలచిన వారు నేషనల్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా సంస్థలో.. గూగుల్ పే యాప్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిని ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్ బోర్డింగ్ విధానం అంటారు. అంటే మనం చేసే పేమెంట్స్ ఏవైనా అకౌంట్ నెంబర్ లేదా డెబిట్ కార్డ్ నెంబర్ ద్వారా లాగిన్ అయితే మాత్రమే జరుగుతుంది. అయితే ఈ ఆధార్ యూపీఐ పేమెంట్స్ కి అకౌంట్, క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన ఎలాంటి వివరాలు అవసరం లేదన తెలిపింది. కేవలం ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుందట. అంటే ఫోన్ పే, గూగుల్ పే లాంటి డిజిటల్ లావాదేవీలు మరింత సులభతరం కానున్నాయనమాట. వీటిని ప్రస్తుతం అన్ని బ్యాంకులకు అనుసంధానం చేయలేదు. ప్రయోగాత్మకంగా కొన్ని బ్యాంకులు మాత్రమే ఈ సేవలను అందిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఈ ఫీచర్ అన్ని బ్యాంకులకు విస్తరించే అవకాశం ఉంది. ఇదే గనుక జరిగితే ఒకే యూపీఐ ఐడీ ద్వారా డిజిటల్ చెల్లింపులు చేసుకునేందుకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

ఆధార్ తో అనుసంధానం ఇలా..

గూగుల్ పే వినియోగించే కస్టమర్లు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదు ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఒకవేళ ఆధార్ లింక్ ఆప్షన్ ఎన్నుకున్నట్లయితే వినియోగదారుని ఆధార్ కార్డులో ఉండే మొదటి ఆరు అంకెలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ప్రైమరీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. ఆ తరువాత ఆధార్, బ్యాంకు ఖాతాలలో ఏ ఫోన్ నంబర్ అయితే ఇచ్చి ఉంటారో ఆ మొబైల్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేశాక ప్రక్రియ మొత్తం పూర్తి అయి యూపీఐ పిన్ సెట్ చేసుకోమని అడుగుతుంది. మనకు గుర్తుండే నంబర్ ను నమోదు చేసుకుంటే సరిపోతుంది. ఇలా చేసిన తరువాత వినియోగదారుడు తన బ్యాంకు బ్యాలెన్స్ వివరాలతో పాటూ లావాదేవీలు చేసే ఆప్షన్స్ ను చూపిస్తుంది. పేమెంట్ చేసేటప్పుడుకానీ, బ్యాలెన్స్ వివరాలు చూసుకునే ప్రతిసారీ ఆధార్ లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కస్టమర్ కి అడ్వాంటేజ్ అనే చెప్పాలి. మన ఫోన్ ద్వారా పేమెంట్స్ ఇతరులు చేయాలంటే మన ఆధార్ నంబర్ అతనికి తెలిసి ఉండాలి. ఒకవేళ తప్పుడు అంకెలను నమోదు చేస్తే అది ధృవీకరించదు. ఇలా డిజిటల్ చెల్లింపులు మరింత సేఫ్ గా చేసేందుకు దోహదపడుతుంది.

T.V.SRIKAR