AAP party : ప్రధాని ఇంటి ముట్టడికి ఆప్ పార్టీ పిలుపు.. మోదీ ఇంటికి భద్రత పెంపు..

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Case) కేసులో ఆప్ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 26, 2024 | 01:30 PMLast Updated on: Mar 26, 2024 | 1:33 PM

Aap Party Calls For Siege Of Prime Ministers House Increase Security At Modis House

ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor Case) కేసులో ఆప్ పార్టీ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ (ED) అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. కేజ్రీవాల్ ను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఆమ్ ఆద్మీపార్టీ ( Aam Aadmi Party) నేతలు ప్రధాని మోదీ (Prime Minister Modi) ఇంటి ముట్టడికి నేడు పిలుపు నిచ్చారు. దీంతో ఢిల్లీలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రధాని ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

పోలీసులకు అందిన సమాచారం మేరకు.. ఢిల్లీలోని పటేల్ చౌక్ ప్రాంతానికి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చేరుకునే అవకాశముండటంతో ఢిల్లీలో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. ఇప్పటికే పటేల్ చౌక్ మెట్రో స్టేషన్ ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఢిల్లీ పోలీసులు హైజరెస్ట్ చేశారుజ ఆందోళనలకు ఎటువంటి అనుమతి లేదని పోలీసులు ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు చెప్పారు. అయిన పోలీసుల హెచ్చరికలను బేఖాతర్ చేసి ఆందోళనకు బయలుదేరావు. ఢిల్లీ ప్రధాన మార్గాలు కేంద్ర ఆధీనంలోకి తీసుకుని ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. ప్రధాని నివాసానికి వెళ్లే తుగ్లక్ రోడ్డు, సఫ్తర్‌గంజ్ రోడ్డు, కేమల్ అటుటర్ మార్గ్ లలో వాహనాలకు అనుమతించడం లేదు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.