Venu Swami : ఆపవయ్యా స్వామీ… వేణుస్వామిని ఆడుకున్న ప్రభాస్ తల్లి..
వేణుస్వామి (Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ జోతిష్యుడు (Celebrity Horoscope) అంటారు ఈయనను! ఏదో జరగబోతుందని జాతకాలు చెప్తూ... జరగకపోతే కవర్ చేస్తూ.. అర్థం పర్థం లేని జోతిష్యాలు చెప్తూ.. పబ్బం గడిపేస్తున్న వ్యక్తి వేణుస్వామి. రాజకీయ నాయకుల నుంచి.. సినిమా హీరోల వరకు.. అందరి జాతకాలు ఇవే అంటూ.. వేణుస్వామి కెమెరా ముందు స్కెచ్‌లేసి మరీ చెప్తుంటారు.

Aapavayya Swami... Prabhas's mother who played Venu Swami..
వేణుస్వామి (Venu Swamy) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ జోతిష్యుడు (Celebrity Horoscope) అంటారు ఈయనను! ఏదో జరగబోతుందని జాతకాలు చెప్తూ… జరగకపోతే కవర్ చేస్తూ.. అర్థం పర్థం లేని జోతిష్యాలు చెప్తూ.. పబ్బం గడిపేస్తున్న వ్యక్తి వేణుస్వామి. రాజకీయ నాయకుల నుంచి.. సినిమా హీరోల వరకు.. అందరి జాతకాలు ఇవే అంటూ.. వేణుస్వామి కెమెరా ముందు స్కెచ్‌లేసి మరీ చెప్తుంటారు. ప్రభాస్ జాతకం అంటూ వేణు స్వామి చెప్పే విషయాలు వైరల్ అవుతుంటాయ్. ఫేమస్ సెలెబ్రిటీల గురించి వేణు స్వామి కొన్ని విషయాలు చెప్తుంటాడు. అందులో కొన్ని జరుగుతాయ్.. ఆయన అదృష్టం కొద్దీ! నాగచైతన్య(Naga Chaitanya), సమంత (Samantha)పెళ్లి టైమ్‌లోనే వారికి విడాకులు అవుతాయని అన్నాడు. వారి జాతకం బాగా లేదని, దోషాలున్నాయని.. వారికి విడాకులు అవుతాయని ముందే చెప్పేశాడు. తీరా చూస్తే నాలుగేళ్లకు వేణు స్వామి చెప్పిందే నిజమైంది. రష్మిక జాతకం (Rashmika Jataka) కూడా బాగా లేదని.. ప్రత్యేక పూజలు చేశానని, పాత్ బాయ్ ఫ్రెండ్‌తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని చెప్పానని..
ఆ తర్వాత ఎలా ఎదిగిందో అందరికీ తెలిసిందే కదా అని వేణుస్వామి సెలెబ్రిటీల గురించి మాట్లాడుతుంటాడు.
ప్రభాస్ గురించి కూడా వేణుస్వామి ఆ మధ్య ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. ప్రభాస్ కెరీర్ ఖతమ్ అయిందని.. ఇక సినిమాలు ఆడవు అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చినంత పని చేశాడు. ప్రభాస్‌కు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెప్పాడు. సలార్ (Salar) హిట్ తర్వాత వేణుస్వామిని తిట్టని ప్రభాస్ ఫ్యాన్ లేడు. అసలు కెరీర్ ఖతమ్ అన్నావ్.. హిట్ గురించి ఏమంటావ్ స్వామీ అంటూ కడిగేశారు. ఇలా వేణుస్వామి ఇష్టమొచ్చినట్టుగా చెప్పే జాతకాలపై.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఐతే కృష్ణంరాజు భార్య శ్యామలా దేవీ కూడా వేణుస్వామి మీద సెటైర్ల మీద సెటైర్లు వేశారు. వేణుస్వామి జాతకాలన్నీ ఉత్తవే అన్నట్లు కామెంట్ చేశారు.
ప్రభాస్ జాతకం వాళ్ల అమ్మకి మాత్రమే తెలుసని.. తమకు కూడా తెలియదని.. అలాంటిది వేణుస్వామికి ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఆయన చెప్పేది అంతా అవాస్తవమే.. ఆయన చెప్పే మాటలు మాకు బాధను కలిగిస్తున్నాయని కామెంట్ చేశారు. ఎవరూ వాటిని నమ్మాల్సిన పని లేదు అని శ్యామలా దేవీ అన్నారు. దీంతో ఆమె కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. అన్నీ అడ్డం తిరుగుతున్నాయ్ స్వామీ.. ఎందుకైనా మంచిది.. మీ జాతకం కూడా ఒకసారి చూసుకోండి అంటూ.. కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.