Abhishek Sing: సినిమాల మీద ఇష్టంలో IAS ఉద్యోగానికి రాజీనామా
యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. మోడలింగ్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. తన ఐఏస్ స్థానాన్ని కూడా వదులుకునేంత పిచ్చి. అందుకే మోడలింగ్ కోసం ఉద్యోగంలో అనేక వివాదాలు ఎదుర్కున్నాడు అభిషేక్ సింగ్.

Abhishek from Uttar Pradesh wanted to resign from IAS post for film opportunities
సినిమా పిచ్చి ఉండేవాళ్లను రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం. ఒక్క చాన్స్ అండి.. ఒకే ఒక్క చాన్స్ ఇస్తే చాలు మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం అనే బ్యాచ్ హైదరాబాద్‌లో కుప్పలు కుప్పలుగా ఉంటారు. ఇందులో చాలా మంది మంచి ఉద్యోగాలు వదిలేసి.. సినిమాల మీద ఇష్టంతో ఇక్కడ అవకాశాల కోసం తిరుగుతుంటారు. చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేస్తే ఓకే.. కానీ ఈ ఘనుడు మాత్రం సినిమాల కోసం ఏకంగా ఐఏఎస్ ఉద్యోగానికే రాజీనామా చేశాడు. ఇతని పేరు అభిషేక్ సింగ్. 2011 యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్. మోడలింగ్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే.. తన ఐఏస్ స్థానాన్ని కూడా వదులుకునేంత పిచ్చి. అందుకే మోడలింగ్ కోసం ఉద్యోగంలో అనేక వివాదాలు ఎదుర్కున్నాడు అభిషేక్ సింగ్. ఉద్యోగం చేస్తూనే కొన్ని సినిమాల్లో నటించాడు కూడా.
గతేడాది అభిషేక్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల అబ్జర్వర్‌గా ఎంపికయ్యారు. ఆ బాధ్యతల కోసం గుజరాత్ వెళ్లిన అభిషేక్.. తానే అబ్జర్వర్ అని తెలిపే ఫొటో ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆయనపై వేటు పడింది. ఆయన్ను ఎన్నికల విధుల నుంచి తప్పించింది ఈసీ. ఆ తర్వాత కూడా ఆయన కొన్ని రోజులు ఐఏఎస్ బాధ్యతలు స్వీకరించలేదు. ఇక విధుల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో అభిషేక్ సస్పెండ్ అయ్యారు. ఇప్పటికీ ఆయనపై సస్పెన్షన్ వేటు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎలాగూ సస్పెండ్ అయ్యాను కదా ఇక మొత్తానికే ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమాల్లోకి వెళ్లిపోతా అనుకున్నాడేమో.. ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
ఉన్నతాధికారులు కూడా అభిషేక్ రాజీనామాను దృవీకరించారు. ఐఏఎస్ అవ్వడమే చాలా మందికి కలగా ఉంటుంది. ఆ సర్వీస్‌లో ఎంటర్ అవ్వడం అంత ఈజీ విషయం కాదు. ఏళ్లనాటి శ్రమ, పట్టుదల ఉంటే తప్ప యూపీఎస్సీ క్రాక్ చెయ్యలేరు. అలాంటి ఆ ఉద్యోగాన్ని సినిమాల కోసం సింపుల్‌గా వదిలేశాడు అభిషేక్. ఇక సోషల్ మీడియాలో అభిషేక్ నిర్ణయాన్ని కొందరు తప్పు పడుతుంటే కొందరు మాత్రం మెచ్చుకుంటున్నారు. ఇన్‌స్టాలో మనోడికి 50 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ఫాలోయింగ్ చూసే హీరో అవ్వాలి అనుకున్నాడు కావొచ్చు.