Chandrababu: చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ పొడిగింపు.. బెయిల్, కస్టడీ వాదనలు రేపటికి వాయిదా

చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీ పొడిగిస్తూ ఏసీబీ కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అక్టోబర్ 19 వరకూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండాలని తెలిపింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 5, 2023 | 05:51 PMLast Updated on: Oct 05, 2023 | 5:51 PM

Acb Court Issued Orders Extending Chandrababus Remand

చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి నేటితో 27 రోజులు పూర్తయింది. నేటితో జ్యూడిషియల్ రిమాండ్ గడువు కూడా ముగియనుంది. ఈ నేపథ్యంలో జ్యూడీషియల్ కస్టడీని 15 రోజుల పాటూ పొడిగించాలని కోరుతూ పిటిషన్ వేశారు సీఐడీ అధికారులు. దీనిపై ఇరువురి వాదనలు ఏసీబీ కోర్టులో వినిపించారు న్యాయవాదులు. అయితే చంద్రబాబు జ్యూడీషియల్ కస్టడీని అక్టోబర్ 19 వరకూ పొడిగిస్తూ ఉత్తర్వులు జరీ చేసింది ఏసీబీ కోర్టు. బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదలను ఎలా సాగాయో ఇప్పుడు చూద్దాం.

సీఐడీ తరఫు వాదనలు..

ఈక్రమంలో పొన్నవోలు సుధాకర్ సంచలనమైన ఆధారాలను జడ్జి ముందు ప్రవేశపెట్టారు. వీటిని ఏసీబీ కోర్టు స్వీకరించింది. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు తెలిపే కీలక డాక్యూమెంట్లుగా పరిగణించాలని కోరారు. లేని కంపెనీలను సృష్టించి ఎలా నిధులు మళ్లించారో తెలిపారు. ఈ డొల్ల కంపెనీల నుంచి తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి నిధులు ఎలా విడుదలయ్యాయో వివరించారు. దీనిని సంబంధించిన మరిన్ని వివరాల కోసం బ్యాంకు ఆడిటర్ ను పిలిచామన్నారు. ఆయన ఈనెల 10న విచారణకు వచ్చేందుకు సుముఖత చూపారని తెలిపారు. ఈనేపథ్యంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరు చేస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారన్నారు. అందుకే 15 రోజుల జ్యూడీషియల్ కస్టడీతో పాటూ సీఐడీ విచారణకు ఆదేశించాలని కోరారు. పొన్నవోలు వాదనలతో కోర్టు ఏకీభవిస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. సాధ్యమైనంత వరకూ ఈరోజు బెయిల్ రాకపోవచ్చనే వాదనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీనికి అనేక కారణాలు ఉన్నాయి.

చంద్రబాబు తరఫు వాదనలు ఇలా..

ఏసీబీ కోర్టులో వాడి వేడిగా చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. చంద్రబాబు ఎలాంటి తప్పిదాలకు పాల్పడలేదని, సాంకేతికంగా చూసినా చంద్రబాబుకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదన్నారు దూబే. నాటి ప్రభుత్వం స్కిల్ కార్పోరేషన్ కి ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీల సంగతేంటని ఏసీబీ జడ్జి ప్రశ్నించారు.
దీనికి స్పందించిన దూబే.. స్కిల్ కేసును పొన్నవోలు గంగా నది.. సాగర సంగమం అంటూ పొలుస్తున్నారు.అధికారుల అధ్యయనాన్ని ఆమోదిస్తూ నివేదిక ఇచ్చిన తర్వాతే ఒప్పందానికి కెబినెట్ ఆమోదం తెలిపింది. బ్యాంకు గ్యారెంటీలు స్కిల్ కార్పోరేషనుకు నాటి ప్రభుత్వం ఇచ్చింది. సీమెన్సుతో ఒప్పందం చేసుకుంది స్కిల్ కార్పోరేషనే తప్ప.. ప్రభుత్వం కాదు అని వాదించారు. స్కిల్ కార్పోరేషన్, సీమెన్స్ ఇండియా, డిజైన్ టెక్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం 2.40 లక్షల మందికి నైపుణ్యంలో శిక్షణ ఇచ్చారు అని తెలిపారు. అలాగే ఈ ఒప్పందంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని.. అయినా ఒకవేళ ఏమైనా తప్పిదాలు ఉంటే.. చంద్రబాబుకేం సంబంధం అని ప్రశ్నించారు. స్కిల్ ప్రాజెక్టుకు ఆమోదం తెలపడంతోనే సీఎంగా చంద్రబాబు పాత్ర పూర్తైందని ఇది పూర్తి గా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని వాదించారు. ఇప్పటి వరకూ చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు అని తెలిపారు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణాధికారులకు సహకరించారు అందుకే ఇక కస్టడీ కూడా అవసరం లేదన్నారు. కేవలం విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారని ఈ అంశాలను పరిశీలించి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్లు తమ వైపు వాదనలు వినిపించారు.

జడ్జి ఏమన్నారు..

ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలు కొనసాగుతోన్న సమయంలో సీఐడీ, చంద్రబాబు న్యాయవాదుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను బెదిరిస్తున్నారంటూ పొన్నవోలును ఉద్దేశించి ప్రమోద్ కుమార్ దూబే మండిపడ్డారు. దానికి బదులిస్తూ నేనేం భయపెట్టడం లేదు.. నా వాదనలు వినిపిస్తున్నానన్నారు పొన్నవోలు. దీంతో కాసేపు కోర్టు హాల్లో గందరగోళం నెలకొంది. ఆగ్రహించిన జడ్జి.. ఇలాగే వ్యవహరిస్తే విచారణ రేపటికి వాయిదా వేసేస్తానని హెచ్చరించారు. దీంతో కోర్టు హాల్ నుంచి బయటకు వచ్చేసిన పొన్నవోలు. ఇరుపక్షాలకూ వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతున్న చంద్రబాబు తరపు న్యాయవాదులు. ఈ కోర్టు హాల్లో తాను బాధితుడిగా మారానని దూబే అన్నారు. చంద్రబాబును వర్చువల్ విధానం ద్వారా ఏసీబీ కోర్టు ఎదుట హాజరయ్యారు. బెయిల్, కస్టడీ పిటిషన్లు రెండూ పెండింగులో ఉన్నాయని చంద్రబాబుకు ఏసీబీ జడ్జి చెప్పారు. అలాగే ఇవాళ్టీతో చంద్రబాబు రిమాండ్ మిగిసిందని అందుకే 19వ తేదీ వరకు జ్యూడిషియల్ రిమాండుకు ఆదేశిస్తున్నాననే విషయాన్ని చంద్రబాబుకు చెప్పారు.

T.V.SRIKAR