ఉ… పోయిస్తున్న తెలంగాణా ఏసీబీ… ఈ ఏడాది ట్రాక్ రికార్డ్ ఇదే…!
తెలంగాణాలో అవినీతి పరులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. అవినీతి పరుడు అనే సమాచారం వస్తే చాలు... ఎంత వరకైనా వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ ఫోకస్ చేసింది.
తెలంగాణాలో అవినీతి పరులను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారులు దాడులకు దిగుతున్నారు. అవినీతి పరుడు అనే సమాచారం వస్తే చాలు… ఎంత వరకైనా వెళ్లి అరెస్ట్ చేస్తున్నారు. అన్ని శాఖలల్లో అవినీతిపరులపై ఏసీబీ ఫోకస్ చేసింది. గడిచిన 8 నెలల కాలంలో ఏకంగా 105 కేసులు నమోదు చేసింది. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికం కావడం ఏసీబీ సత్తా ఏంటో తెలియజేస్తుంది.
కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసింది. పది రోజుల వ్యవధిలో 6 కేసులు నమోదు చేసిందంటే… ఏసీబీ దూకుడు ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ ,రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో ఎక్కువ అవినీతి అధికారులు ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏసీబీ నుండి అవినీతిపరులు తప్పించుకోలేరంటూ ఎసిబి డీజీ సివి ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
నిన్న ఎనిమిది లక్షలు లంచం తీసుకుంటూ రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి ఏసీబీకి దొరికిపోయారు. సినిమా ఫక్కీలో ఈ అరెస్ట్ జరిగింది. నిజామాబాద్ మున్సిపల్ సూపరిండేంట్ దాసరి నరేంద్రపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసారు. నరేంద్ర ఇంట్లో 2.93 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి సిసిఎస్ లో పనిచేస్తున్న సిఐ వెంకట కిషోర్ పై సిబిఐ అధికారులు కేసులు నమోదు చేసారు. దీనితో తెలంగాణా ప్రభుత్వ ఉద్యోగుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.