Elon Musk: ట్విటర్ బిల్డింగ్ మీద కొత్త లోగో.. చిక్కుల్లో పడ్డ ఎలాన్ మస్క్
ట్విటర్ ఎలాన్ మస్క్ చేతికి వచ్చిన తరువాత ఆ కంపెనీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. కంపెనీలో ఉద్యోగులను తీసేయడంతో మొదలుపెడితే ఇప్పటి వరకూ చాలా మార్పులు చేశాడు మస్క్.

According to San Francisco rules, he did not seek permission from the authorities to change his Twitter logo
వెరిఫైడ్ బ్లూ టిక్‌కు సబ్స్క్రిప్షన్ తీసుకువచ్చాడు. ఇప్పుడు ఏకంగా ట్విటర్ లోగో మార్చి అందరినీ షాక్‌కు గురి చేశాడు. మొన్నటి వరకూ ఉన్న బ్లూ బర్డ్ లోగోను ఎక్స్‌తో రీప్లేస్ చేశాడు. మొదట వెబ్ వెర్షన్‌లోనే వచ్చిన లోగో ఇప్పుడు మొబైల్ వెర్షన్‌లో కూడా వస్తోంది. ఇప్పుడు ట్విటర్ ప్రధాన కార్యాలయం మీద కూడా బ్లూ బర్డ్ లోగోను తీసేశారు. దాని ప్లేస్‌లో కొత్తగా వచ్చిన ఎక్స్ లోగోను పెట్టారు. ఈ వీడియోను ఎలాన్ మస్క్ స్వయంగా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇదే విషయం ఇప్పుడు మస్క్‌ను చిక్కుల్లో పడేసింది.
శాన్‌ఫ్రాన్సిస్కో రూల్స్ ప్రకారం ఏదైనా కంపెనీ లోగోను బిల్డింగ్స్ మీద పెట్టాలన్నా వాటిని మార్చలన్నా అధికారుల పర్మిషన్ తప్పనిసరి. కానీ మస్క్ మాత్రం ఎలాంటి పర్మిషన్ లేకుండానే లోగోను చేంజ్ చేశాడు. దీంతో అధికారులు ఈ విషయంలో విచారణకు ఆదేశించారు. ట్విటర్‌కు నోటీసులు కూడా జారీ చేశారు. దీనిపై కంపెనీ, మస్క్ ఎలాంటి వివరణ ఇస్తారో చూడాలి.