యాక్టింగ్ వచ్చా..? 1000 కోట్ల వెటకారం.. సాలిడ్ సమాధానం..
పాన్ ఇండియా లెవల్ హిట్లు పడ్డాక, ఆసియా లెవల్లో కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నాక... ఎవరైనా నీకు యాక్టింగ్ వచ్చా అంటే ఎలా ఉంటుంది... ? అలాంటి భయంకరమైన ప్రశ్న వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ వేశాడు.

పాన్ ఇండియా లెవల్ హిట్లు పడ్డాక, ఆసియా లెవల్లో కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నాక… ఎవరైనా నీకు యాక్టింగ్ వచ్చా అంటే ఎలా ఉంటుంది… ? అలాంటి భయంకరమైన ప్రశ్న వివాదాల వర్మ రామ్ గోపాల్ వర్మ వేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రెబల్ స్టార్ ప్రభాస్ వీళ్లెవరినీ ఆర్జీవీ గెలకలేదు. కాని తను సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్టరా అన్న ప్రశ్న వేయగానే, సీన్ లోకి ఎన్టీఆర్, ప్రభాస్, బన్నీ వీల్లందరి పేర్లొచ్చాయి. నాగార్జునకి ఈ మ్యాటర్ తో సంబంధంలేదు… చిరుకి అస్సలు కనెక్షనే లేదు. కాని వాళ్ల పేర్లు ట్రోలింగ్ కి గురౌతున్నాయి. తమిళ తంబీలు మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులని చెప్పుకునే వాళ్లు, రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మీద గన్ గురిపెట్టి, సడన్ గా టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ల మీద బుల్లెట్లు కురిపిస్తున్నారు… ఇంతకి సూపర్ స్టార్ రజినీకాంత్ మీద రామ్ గోపాల్ వర్మ బాంబు పేలిస్తే, ఎందుకు తమిళ తంబీలు, మనోళ్లని తగులుకున్నారు…? దీనికి ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ అండ్ కో ఫ్యాన్స్ కౌంటర్స్ ఎలా ఉన్నాయి…? హావేలుక్
కంటెంట్ తక్కువ కాంట్రవర్సీస్ ఎక్కువ.. ఇది రామ్ గోపాల్ వర్మ ప్రజెంట్ జర్నీ… అలాంటి తను సడన్ గా తమిళ సూపర్ స్టార్ గాలి తీసేశాడు. అమితాబ్, రజినీకాంత్ లాంటి స్టార్స్ చరిష్మానే వేరని అంటూనే, రజినీకాంత్ నిజంగా మంచి నటుడా అన్నాడు. తను సత్యలో మికు మాత్రే లాంటి పాత్రలో ఊహించుకోగలమా అన్నాడు. దీనికితోడు స్లో మోషన్ లేకుండా, అలాంటి సీన్లు లేకుండా రజినీ కాంతే ఉండడన్నాడు.అంటే సింపుల్ గా అసలు రజినీకాంత్ గొప్ప నటుడేం కాదు, కేవలం స్టార్ మాత్రమే అనేశాడు. స్టార్స్ కి గొప్ప నటులవ్వాలన్న రూలేం లేదు. జనాలకు నచ్చితే చాలు… వాళ్లకేం నచ్చిందో, అదే నటన.. ఇది చాలా మంది చెప్పే డెఫినేషన్. కాని ఇది కోలీవుడ్ ఫ్యాన్స్ తీసుకోలేకపోయారు. రజినీ ఫ్యాన్స్అయితే సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ మీద ట్రోలింగ్ పెంచారు
విచిత్రం ఏంటంటే ఈ మ్యాటర్ కి ఏమాత్రం సంబంధం లేని ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, చిరు ఇలా ఎవరెవరిపేర్లో వచ్చేశాయి. ముందుగా నాగ్, వెంకీ అంతబాగా నటిస్తారా…శివ తీసేస్తే నాగ్ పరిస్థితేంటని కొందరు, కాదు మెగాస్టార చిరు బిల్డప్ సీన్లు లేకపోతే, తన పరిస్థితేంటని ఇంకొందరు, వాళ్ల కోపాన్ని మన హీరోల వైపు తిప్పినట్టున్నారు.విచిత్రం ఏంటంటే మెగా స్టార్ చిరంజీవిని అటు రజినీ ఇటు కమల్ కలయిక అంటారు. కమల్ లా చిరు నటించగలడు, రజినీలా స్టార్ ఇమేజ్ తో బాక్సాఫీస్ ని శాసించగలడని, ఏకంగా వాళ్ల గురువు కే బాలచందరే అన్నాడు. ఇక ఈ టైపు స్టార్లు మన ఇండస్ట్రీలో మ్యాన్ ఆఫ్ మాసెస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ఇద్దరికీ మాస్ ఇమేజ్ తో స్టార్స్ గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
అంతకుమించి నటన మీద ఎన్టీఆర్ కి ఉన్న పట్టు చూసిన చాలా సార్లు తనని న్యాచురల్ స్టార్ అనాలన్నారు. కాని మాస్ ఇమేజ్ వల్లే, కమర్శియల్ రూట్లో దూసుకెళుతున్నాడు. ఇలా మంచి పెర్ఫార్మర్ తోపాటు స్టార్ ఇమేజ్ ని చిరు తర్వాతీ జనరేషన్ లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ సొంతం చేసుకున్నారు. ప్రభాస్ , మహేశ్ మాత్రం నటుడిగా కంటే స్టార్ గానే ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నారు. నటులుగా పర్లేదనిపించుకున్నారు.ఎలా చూసినా ఎన్టీఆర్, ఏఎన్నార్, చిరు, ఎన్టీఆర్ జూనియర్, బన్నీ ఇలా చాలా మందే ఇటు స్టార్ గా ఫ్యాన్ ఫాలోయింగ్, అటు గొప్ప నటుడిగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. మల్టీ ట్యాలెంటెడ్ అనిపించుకున్నారు. కాని కోలీవుడ్ లో రజినీ స్టారైతే, కమల్ లోకనాయకుడు.. అలా చూస్తే వర్మ మాట కొంతవరకు నిజమే.. కాని తను జడ్జ్ చేయటం, రెక్లెస్ గా రజినీ కాంత్ ని లెక్కలోకి తీసుకోకపోవటమే తప్పనంటున్నారు. ఇక తెలుగు స్టార్స్ లో ఎంతమందికి నటించే సీన్ ఉందంటూ, ప్రభాస్, మహేశ్ అండ్ కో మీద అరవ తంబీలు పడితే, ఇక్కడ నుంచి కూడా ఫ్యాన్స్ కౌంటర్ ఎటాక్ సాలిడ్ గానే కనిపిస్తున్నట్టుంది. మొత్తానికి వర్మ పేల్చిన బాంబు, ఇప్పుడు సౌత్ మొత్తం కంపు కంపైపోయేలా ఉంది.