RENU DESAI: మాధవీలతకు రేణు దేశాయ్ సపోర్ట్.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్

నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 25, 2024 | 05:39 PMLast Updated on: Apr 25, 2024 | 5:39 PM

Actress Renu Desai Supports Bjp Hyderabad Mp Candidate Madhavi Latha

RENU DESAI: రెండు తెలుగు రాష్ట్రాల పొలిటికల్ హీట్ నడుస్తోంది. పార్టీల ప్రచారం హోరెత్తిపోతోంది. ఇంత బిజీ మూమెంట్‌లో నటి రేణు దేశాయ్ పెట్టిన ఓ స్పెషల్ మెస్సేజ్ ఇప్పుడు వైరల్ అయింది. ఆమె ఈ ఎన్నికల్లో ఎవరికి సపోర్ట్ ఇస్తుందో చెప్పకనే చెప్పింది. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.

VICTORY VENKATESH: వియ్యంకులు.. ఖమ్మం కాంగ్రెస్‌ అభ్యర్థికి వెంకటేష్‌కి రిలేషన్‌ ఏంటంటే

రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. మాధవీలత ఫోటోని షేర్ చేస్తూ.. చాలా రోజుల తర్వాత నేను ఓ స్ట్రాంగ్ ఉమెన్‌ని చూస్తున్నా. నేను పోస్ట్ పెట్టినందుకు నాకు ఎలాంటి డబ్బులు రావు. నేను ఫీల్ అయ్యాను కాబట్టే షేర్ చేస్తున్నాను అంటూ పోస్ట్ చేసింది రేణూ దేశాయ్. జనరల్‌గా రేణు పోస్ట్ పెట్టగానే కొందరు నెటిజన్లు నెగిటివ్‌గా రియాక్ట్ అవుతుంటారు. ఎన్నికల టైమ్‌లో పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయట్లేదని ఆమె ట్రోల్స్‌తో ఇబ్బందు పెడుతున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం.. హైదరాబాద్‌లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న మాధవీలత ఫొటోను షేర్ చేసింది. ఫీల్ అయ్యాను కాబట్టే ఆమె ఫోటో షేర్ చేశానంటూ.. నెగిటివ్ కామెంట్స్ పెట్టేవారికి ముందే కౌంటర్ ఇచ్చింది.

మొన్నామధ్య రేణు దేశాయ్ చేతికి కమలం టాటూ ఉన్నట్టుగా ఓ పోస్ట్ వైరల్ అయింది. దాంతో ఆమె బీజేపీకి సపోర్ట్ చేస్తోందని కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు మాధవీలతకు మద్దతు ప్రకటించింది. MIMకి చెందిన సిట్టింగ్ ఎంపీ అసదుద్దున్ ఓవైసీకి పోటీగా.. హైదరాబాద్ పాత బస్తీ ప్రచారంలో దూసుకుపోతున్న మాధవీలత ఈమధ్యే ఇండియా టీవీ ఆప్‌కీ అదాలత్‌లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ వీడియో క్లిప్‌ను ప్రధాని నరేంద్రమోడీ షేర్ చేశారు. ఆమె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. ఇప్పుడు రేణూ దేశాయ్ సపోర్ట్ కూడా మాధవీ లతకు వచ్చింది.