Shobhana: నటి శోభన ఇంట్లో పనిమనిషి చోరీ.. క్షమించి పనిలో పెట్టుకున్నారు.
మన ఇంట్లో ఎవరైనా దొంగతనం చేస్తే ఏం చేస్తాం.. పోలీసులకు పట్టిస్తాం.. ఇంకోసారి వాళ్లు మన ఇంటి వైపు చూడకుండా బుద్ది చెప్తాం. ఐతే అలనాటి మేటి నటి, పెద్దకళ్ల సుందరి శోభన మాత్రం తన గొప్ప మనసు చాటుకుంది.

Actress Shobhana forgave the maid who stole money from her house and put her to work
ఇంట్లో పని మనిషి దొంగతనం చేస్తే.. తిరిగి ఆమెనే మళ్లీ పనిలో పెట్టుకొని.. టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారింది. శోభన ఇంట్లో 41వేల రూపాయల చోరీ జరిగింది. ఇంటి పనిమనిషే దొంగతనం చేసింది. చోరీపై శోభన పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భయపడిన పనిమనిషి చేసిన తప్పును ఒప్పుకుంది. చోరీ చేసిన పనిమనిషిని మంచి మనసుతో క్షమించారు శోభన. వాళ్ల అమ్మ దగ్గర 41వేలు దొంగతనం చేసినప్పటికీ.. తిరిగి ఆమెను పనిలోకి తీసుకున్నారు. పోలీసు కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు. చేసిన తప్పును పనిమనిషి ఒప్పుకోవడం వల్ల.. ఆ 41వేల రూపాయలను నెలవారి జీతంలో తగ్గించి ఇస్తానని తెలిపారు.
తన తల్లితో కలిసి శోభన చెన్నైలో నివాసం ఉంటోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం.. ఇలా దక్షిణాది భాషల్లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో నటించారు శోభన. నటిగానే కాకుండా క్లాసికల్ డ్యాన్సర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్నారు. 2006లో కేంద్ర ప్రభుత్వం శోభనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. రెండు జాతీయ ఫిల్మ్ అవార్డ్‌లను కూడా ఆమె అందుకున్నారు. వీటితో పాటు మరెన్నో అవార్డులు శోభనను వరించాయ్. పనిమనిషి విషయంలో శోభన తీసుకున్న నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు గుప్పిస్తున్నారు. మీది చాలా మంచి మనసు మేడమ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.