adani: నేడు అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై సుప్రీం కోర్టులో విచారణ
అదానీ కంపెనీ చాలా పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టినట్లు చూపించి షేర్ల ధరలను ఎక్కువ చేసి చూపిందని ఆరోపణలు ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్ట్ లో విచారణ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఢిల్లీ: సుప్రీం కోర్టులో నేడు అదానీ-హిండెన్ బర్గ్ అంశంపై విచారణ జరుగనుంది. గత విచారణ సందర్భంగా మదుపర్ల భద్రతను నిర్ధారించే అంశంలో నిపుణుల కమిటీని వేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హిండెన్ బర్గ్ నివేదిక వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో అదానీ కంపెనీల్లో అవకతవకలపై విచారణ జరపాలన్న మరో పిటిషన్ ను కూడా విచారించనున్నట్లు తెలుస్తుంది. సుప్రీంకోర్టు అదానీ కంపెనీల్లో ఎల్ఐసి, ఎస్బీఐ పెట్టుబడులపై దర్యాప్తు జరపాలని కోరిన పిటిషనర్. వీటన్నింటికీ సుప్రీంకోర్టు ఏవిధంగా స్పందిస్తుంది అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
గతంలో హిండెన్ బర్గ్ చేసిన సర్వేలన్నీ నిజమనే తేలింది. అమెరికాకు చెందిన కొన్ని సంస్థలపై ఈ దర్యాప్తు సంస్ధ నిఘాపెట్టి పలు కీలక విషయాలను వెల్లడించింది. ఈ సంస్ధలో పనిచేసేది పది మందే అయినా దీనికి నెట్వర్క మాత్రం చాలా వేల సంఖ్యలో ఉంటుంది. వీరికి ప్రభుత్వ ప్రైవేట్ సంస్ధల అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. దీని ఆధారంగా వీరికి కావల్సిన కీలక సమాచారాన్ని సేకరించడంలో చాలా ముఖ్యపాత్రపోషిస్తారు. అందుకే వీరు చేసే సర్వేలో సంచలనమైన విషయాలు, ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయి.
ఈ సర్వే నిజమని తేలితే అదానీకి ఏస్ధాయిలో కోర్టు శిక్ష వేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగానికి సంబంధించిన చాలా వరకూ ఆస్తులు ఈ సంస్ధ చేతిలో ఉన్నందులన ప్రభుత్వమే ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంది. సుప్రీం కోర్ట్ త్వరగా విచారణ జరిపి దీనిపై తుది తీర్పును వీలైనంత త్వరగా వెల్లడిస్తుందా. లేక కీలక ఆధారాలు లభ్యమయ్యే వరకూ కేసులో జాప్యం ప్రదర్శిస్తుందా వేచి చూడాలి.