Ambani అంబానీ ఆస్తిని సొంతం చేసుకున్న అదానీ..
బిలియనీర్స్ అనగానే ఇండియాలో అందరికీ గుర్తొచ్చే పేర్లు అంబానీ, అదానీ. చాలా తక్కువ టైంలోనే బిలియనీర్‌గా ఎదిగిన అదానీ.. ప్రపంచంలోని అత్యంత సంపన్నులో ఒకరుగా నిలిచారు. కానీ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌తో భారీ స్థాయిలో ఆస్తిని కోల్పోయారు.

Adani is going to buy Anil Ambani's Vidarbha Industries Power Limited
ఆ కంపెనీ రిపోర్ట్ బయటికి వంచ్చిన తరువాత దాదాపు 150 మిలియన్ డాలర్ట మార్కెట్ వాల్యూ కోల్పోయారు అదానీ. అలాంటి అదానీ ఇప్పడు అంబానీ కంపెనీకి ఎసరు పెట్టారు. అనిల్ అంబానీకి చెందిన విదర్భ ఇండస్ట్రీస్ పవర్ లిమిటెడ్‌ను కొనుగోలు చేయబోతున్నారు. దీనికోసం ఆయన ఇప్పటికే బిడ్ దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. 2.8 బిలియన్ డాలర్లకు విదర్భ ఇండస్ట్రీస్‌ను సొంతం చేసుకోబోతున్నారు అదానీ. విదర్భ ఇండస్ట్రీస్ మీద ఉన్న అప్పును తిరిగి చెల్లించకపోవడంతో కంపెనీని స్వాధీనం చేసుకుంది బ్యాంక్. లోన్‌ను భర్తీ చేసేందుకు ఆ కంపెనీని వేలం వెయ్యాలని నిర్ణయించింది.
ఈ వేలంలో కంపెనీ దక్కించుకునేందుకు అదానీ ఇండస్ట్రీస్ బిడ్ దాఖలు చేసింది. ఇదే బిడ్‌ను దక్కించుకునేందుకు రియలన్స్ సంస్థ కూడా ప్రయత్నించింది. బిడ్ కూడా ఫైల్ చేసింది. కానీ ఇంటర్నల్‌గా ఏం జరిగిందో కానీ బిడ్ మాత్రం అదానీకే వచ్చినట్టు సమచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బిడ్ ఫైనల్ ఐతే ఇక నుంచి అంబానీ పేరున ఉన్న విదర్భ సంస్థ అదానీకి మారిపోతుంది. అదానీ పోర్ట్‌ఫోలియోలో మరో కోల్-పవర్ ప్రాజెక్ట్ చేరుతుంది. దీంతో పాటు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ద్వారా జరిగిన డ్యామేజ్ నుంచి అదానీ కంపెనీ కాస్త కోలుకునేందుకు కూడా ఇదొక మంచి మార్గమంటున్నారు వాణిజ్య నిపుణులు. విదర్భ అందరికీ తెలిసిన కంపెనీ కావడంతో అలాంటి కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ముందుకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు.