Gujarat Titans : గుజరాత్ టైటాన్స్ పై అదానీ కన్ను.. వాటా విక్రయించే యోచనలో సీవీసీ

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ షేర్ విక్రయించేందుకు సిద్ధమవుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 20, 2024 | 03:35 PMLast Updated on: Jul 20, 2024 | 3:35 PM

Adanis Eye On Gujarat Titans Cvc Plans To Sell Stake

ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ఫ్రాంచైజీ యాజమాన్యం మారబోతోంది. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీకి ఓనర్ గా ఉన్న సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ షేర్ విక్రయించేందుకు సిద్ధమవుతోంది. బీసీసీఐ నిబంధనల ప్రకారం కొత్త జట్లలో వాటాలను విక్రయించేందుకు ఉన్న లాక్ పిరియడ్ వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీవీసీ క్యాపిటల్స్ మెజార్టీ వాటాను అమ్మకానికి పెట్టబోతున్నట్టు సమాచారం. గుజరాత్​ టైటాన్స్​పై అదానీ గ్రూప్​ ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా వాటాను కొనుగోలు చేయడానికి అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్ పార్ట్​నర్స్​తో చర్చలు జరుపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

గుజరాత్ టైటాన్స్ విలువ 1 బిలియన్ డాలర్ల నుంచి 1.5 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా.. సీవీసీ క్యాపిటల్ 2021లో ఈ ఫ్రాంచైజీని 5 వేల 625 కోట్లకు కొనుగోలు చేసింది. తొలి సీజన్ లోనే గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్ గా నిలవడంతో ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ కూడా పెరిగింది.కాగా అదానీ గ్రూప్ ఇప్పటికే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ , యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20ల్లో జట్లను కొనుగోలు చేసింది. వుమెన్స్ లీగ్ లో అహ్మదాబాద్ ఫ్రాంచైజీని అదానీ గ్రూప్ 1,289 కోట్ల టాప్ బిడ్​తో దక్కించుకుంది. గుజరాత్​ టైటాన్స్​ ఇప్పటి వరకూ మూడు ఐపీఎల్​ సీజన్స్​లో ఆడింది. గత సీజన్ లో ఫైనల్ కు చేరిన ఆ జట్టు ఈ ఏడాది 8వ స్థానానికే పరిమితమైంది.