Addanki Dayakar: కంటోన్మెంట్ రేసులో అద్దంకి ? ఏకగ్రీవం లేనట్టేనా ?
అయితే BRS టిక్కెట్ నివేదితకు ఇస్తారా లేదా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏకగ్రీవ ఎన్నికపై కాంగ్రెస్, బీజేపీల్లోనూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఉపఎన్నికలో నిలబడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతల అద్దంకి దయాకర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది.
Addanki Dayakar: BRS ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగబోతోంది. మే 13న లోక్ సభ ఎన్నికలతో పాటే ఇక్కడ బైఎలక్షన్ నిర్వహించబోతోంది ఈసీ. ఇలాంటి సందర్భాల్లో గతంలో ఏ పార్టీ కూడా పోటీ చేయకుండా.. ఆ కుటుంబానికి చెందిని వ్యక్తి ఏకగ్రీవంగా గెలిచేందుకు సహకరించే పరిస్థితి ఉంది. అదే పద్దతి ఫాలో అయితే లాస్య నందిత చెల్లెలు నివేదిత గెలువడం ఖాయం.
WHERE IS SHARMILA : షర్మిల కనబడుటలేదు ఎన్నికలవేళ మాయమైన చెల్లెమ్మ !!
అయితే BRS టిక్కెట్ నివేదితకు ఇస్తారా లేదా అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. ఏకగ్రీవ ఎన్నికపై కాంగ్రెస్, బీజేపీల్లోనూ భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మోంట్ ఉపఎన్నికలో నిలబడేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతల అద్దంకి దయాకర్ రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. భువనగిరి అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలు ఆశించిన భంగపడిన అద్దంకిని కంటోన్మెంట్ నుంచి నిలబెట్టాలని సీఎం రేవంత్ డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. గతంలో లాస్య నందితకు పోటీగా.. ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూతురు వెన్నెల నిలబడ్డారు. కానీ లాస్యకి వచ్చిన ఓట్ల కంటే 50శాతం తక్కువగా వెన్నెలకు వచ్చాయి. దాంతో ఆమెను ఈసారి రేసు నుంచి తప్పిస్తారని తెలుస్తోంది. BRS నుంచి మళ్ళీ సాయన్న కుటుంబానికి టిక్కెట్ ఇస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. లాస్య నందిత చెల్లెలు నివేదిత పోటీకి రెడీగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ బీఆర్ఎస్ నుంచి చాలా పేర్లు వినిపిస్తున్నాయి.
పార్టీ సోషల్ మీడియా వ్యవహారాలు చూసిన క్రిశాంక్ మన్నె, 2014లో BRS నుంచి పోటీ చేసి ఓడిన గజ్జెల నాగేష్, ఎర్రోళ్ళ శ్రీనివాస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళంతా తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉన్నవాళ్ళే. వీళ్ళల్లో ఎవరూ పోటీ చేసినా కంటోన్మెంట్ సీటను తిరిగి BRS నిలబెట్టుకుంటుందా అనేది డౌటే. కానీ నివేదితను నిలబెడితే మాత్రం సెంటిమెంట్ ఓట్లతో మళ్ళీ గెలుస్తుందన్న టాక్ గులాబీ పార్టీలో నడుస్తోంది. బీజేపీ ఈసారి కంటోన్మెంట్ లో ఎవర్ని దింపాలన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. నాలుగైదు రోజుల్లో కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే మీటింగ్ లో డిసైడ్ చేసేఅవకాశాలు ఉన్నాయంటున్నారు.