వరల్డ్ క్రికెట్ లో ఆఫ్ఘన్ హవా, రన్స్ పరంగా భారీ విజయం
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఈ ఘనత సాధించింది.
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. తమ వన్డే ఫార్మాట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం నమోదు చేసింది. జింబాబ్వేతో రెండో వన్డేలో ఈ ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 286 పరుగులు చేసింది.
ఓపెనర్లు సెదికుల్లా అతల్ సెంచరీతో చెలరేగగా.. అబ్దుల్ మాలిక్ హాఫ్ సెంచరీతో రాణించాడు. లక్ష్య ఛేదనలో అఫ్గన్ బౌలర్లు నిప్పులు చెరగడంతో జింబాబ్వే 54 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఏకంగా 232 పరుగుల తేడాతో అఫ్గనిస్తాన్ గెలిచింది.
తద్వారా.. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.అఫ్గనిస్తాన్ వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం