MLC KAVITHA: జైల్లో ఉన్న కవితను మళ్లీ అరెస్ట్ చేయడమేంటి.. అసలేంటీ పీటీ వారెంట్..?
ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న నిందితులను.. మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.
MLC KAVITHA: ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి.. తీహార్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను.. సీబీఐ పీటీ వారెంట్‌తో అరెస్టు చేసింది. ఐతే ఇప్పటికే జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేయడం ఏంటి.. అసలు పీటీ వారెంట్ అంటే ఏంటి అనే సందేహాలు ప్రతీ ఒక్కరిని వెంటాడుతున్నాయ్. పీటీ వారెంట్ అంటే.. ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్. ఏదైనా కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న నిందితులను.. మరో కేసులో అరెస్టు చేసేందుకు, లేదంటే అదే వ్యవహారంపై విచారణ జరుపుతున్న మరో దర్యాప్తు సంస్థ అరెస్టు చేసేందుకు వీలు కల్పించేదే ప్రిజనర్ ట్రాన్సిట్ వారెంట్.
Raghu Rama Krishna Raju: విగ్గు రాజు పేరుతో వికీపీడియా.. రఘురామకు అవమానం!
కోర్టు ఎవరినైనా జ్యుడిషియల్ రిమాండ్ కింద జైలుకు పంపినప్పుడు.. ఆ నిందితులు పూర్తిగా ఆ కోర్టు పర్యవేక్షణలోనే ఉన్నట్టు లెక్క. నిందితులు జైలులో ఉన్నా.. వారికి సంబంధించిన ఏ వ్యవహారమైనా.. వారిని రిమాండ్‌కు పంపిన కోర్టు అనుమతితోనే చేయాల్సి ఉంటుంది. ఆ నిందితులను వేరే కేసులో అరెస్టు చేయాల్సి వస్తే.. పోలీసులు ఆ కోర్టుకు వెళ్లి అనుమతి కోరుతారు. ఏ కేసులో, ఎందుకు అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నదో వివరిస్తారు. ప్రిజనర్ ట్రాన్సిట్ వారంట్ ఇచ్చి నిందితులను తమకు అప్పగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఇప్పుడు కవిత అరెస్ట్ వ్యవహారంలో జరిగింది ఇదే. నిందితులను ట్రాన్సిట్ వారంట్ పై అరెస్టు చేసినా.. నిబంధనల ప్రకారం 24గంటల్లోగా… తాము దర్యాప్తు చేస్తున్న ఆ మరో కేసుకు సంబంధించిన కోర్టులో హాజరుపర్చాల్సి ఉంటుంది.
ఈ కోర్టు నిందితులకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తే.. ఈ కోర్టు పరిధిలోని జైలుకు తరలించాల్సి ఉంటుంది. ఒకవేళ పోలీసు కస్టడీకి ఈ కోర్టు అనుమతి ఇస్తే.. ఆ గడువు వరకు పోలీసులు నిందితులను తీసుకెళ్లి వివరంగా ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుంది. పీటీ వారంట్ పై ఉన్న నిందితులకు.. అన్ని కేసుల్లో బెయిల్ వస్తేనే జైలు నుంచి విడుదల అవుతారు. లేకుంటే జైల్లోనే ఉండాల్సి వస్తుంది.