Harthik Pandya: బాల్‌తో నీ డీల్ ఏంటి బ్రో.. ఏం మంత్రం వేశావ్ హార్ధిక్..
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ప్రపంచ కప్ మ్యాచ్ 13వ ఓవర్ లో హార్థిక్ పాండ్యా చేసిన పనికి వికెట్ పడటంతో నెటిజన్లు ఆ వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు

After Harthik Pandya's wicket in the 13th over of the India vs Pakistan World Cup match, netizens are making the video viral.
ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ఔట్ చేయాలంటే రెండే రూట్లు. అద్భుతమైన బంతి అయినా వేయాలి.. లేదంటే బ్యాటర్ కాన్సన్‌ట్రేషన్‌ను దెబ్బ అయినా తీయాలి. అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్లో అంతటి గ్రేట్ డెలివటీ అంటే కష్టం కానీ.. బ్యాటర్‌ను మెంటల్‌గా ఇబ్బంది పెట్టడం పెద్ద మ్యాటరేం కాదు. చాలామంది బౌలర్లు స్లెడ్జింగ్ చేసేది అందుకే ! ఇంకొందరయితే.. తమ మార్క్ చేష్టలతో బ్యాటర్ బుర్రలో గేమ్స్ ఆడుతుంటారు. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌లో అలాంటి పనే చేశాడు హార్ధిక్ పాండ్యా ! హార్ధిక్ చేసిన మ్యాజిక్‌కు.. పాక్ ఓపెనర్ పెవిలియన్‌కు చేరాల్సి వచ్చింది. అహ్మబాదాద్ పిచ్.. బ్యాటింగ్‌కు అనుకూలం. తాను వేసిన ఫస్ట్ రెండు ఓవర్లలోనే 18 రన్స్ ఇచ్చుకున్నాడు హార్ధిక్.
అప్పటికే 36 పరుగులు చేసిన ఇమాముల్.. క్రీజులో పాతుకుపోయాడు. ఇన్నింగ్స్ 13వ ఓవర్ హార్ధిక్‌కు చాన్స్ వచ్చింది. అంతే.. బౌలింగ్ చేయడానికి ముందు బాల్‌కు ఏదో ముచ్చట్లు చెప్పాడు. ఖురాన్ చదివినట్లు.. పిల్లోడు పాఠం వినిపించినట్లు, దేవుడు ముందు ప్రార్ధనలు చేసినట్లు.. మొత్తానికి బాల్‌ను ముందుపెట్టుకొని ఏదో చేశాడు హార్థిక్. ఈ వింత ప్రయత్నం సక్సెస్ అయింది. ఆ తర్వాత బంతికే ఇమాముల్.. రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి దొరికిపోయాడు. హార్ధిక్ చేసిన ఈ పని.. సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. బాల్‌తో డీల్ సెట్ చేసుకున్నావా బ్రో అని కొందరు.. ఆ మంత్రమేదో మాకూ చెప్పరాదే అని ఇంకొందరు.. హార్ధిక్‌కు చేతబడి కూడా తెలుసు అంటూ ఇంకొందరు.. మీమ్స్‌లో నవ్వలు పూయిస్తున్నారు.
మొత్తమ్మీద ఒక్క మంత్రం, ఒక్క వికెట్‌తో సోషల్ మీడియా ఇవాళ్టి సరుకుగా మారిపోయాడు హార్ధిక్. ఇప్పుడే కాదు మనోడే కాదు.. గతంలోనూ ఓ ఆటగాడు ఇలాంటి మంత్రమే వేశాడు ఒకటి. యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ పేసర్ ఇలాంటి మ్యాజిక్ చేసి ఆసీస్ బ్యాటర్ ఔట్ అవడానికి కారణం అయ్యాడు. ఇప్పుడు హార్ధిక్ కూడా సేమ్ టు సేమ్ అలాంటి పనే చేసి… సక్సెస్ అయ్యాడు. బాల్‌కు ముచ్చట చెప్తే అది వెళ్లి ఔట్ చేయడం ఏంటి బ్రో.. కామెడీ కాకపోతే !