Nawaz Sharif : ఆరేళ్ల తర్వాత పార్టీ బాధ్యతలు చేపట్టిన నవాజ్ షరీఫ్..
పాకిస్థాన్ (Pakistan) ముస్లిం లీగ్-నవాబ్ (Muslim League ) అధ్యక్షుడిగా పాక్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ మరో సారి ఎన్నికయ్యారు.
పాకిస్థాన్ (Pakistan) ముస్లిం లీగ్-నవాబ్ (Muslim League ) అధ్యక్షుడిగా పాక్ మాజీ ప్రధాని నవాబ్ షరీఫ్ మరో సారి ఎన్నికయ్యారు. పాక్ సుప్రీంకోర్టు షరీఫ్ ను అనర్హుడిగా ప్రకటించిన తర్వాత పాకిస్థాన్ ముస్లిం లీగ్- నవాజ్ (పీఎంఎల్-ఎన్) జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆయనను తిరిగి అధ్యక్షుడిగా.. పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో నిన్న ఏక్రగ్రీవంగా ఆయన పేరు ఖరారైంది. మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన ఆయన.. పనామా పత్రాల కేసులో ఆరోపణలతో తప్పుకోవాల్సి వచ్చింది. అవినీతి ఆరోపణలతో దేశం విడిచి లండన్‌కు ప్రవాసం వెళ్లిపోయారు. తిరిగి 2023 అక్టోబర్‌లోనే స్వదేశానికి తిరిగొచ్చారు. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టటం విశేషం..
1999లో భారత మాజీ ప్రధాని వాజ్పేయి హయాంలో కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందాన్ని తమ దేశం ఉల్లంఘించిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. “మే 28 1998న, నవాజ్ పదవీ కాలంలో పాక్ తొలిసారి అణుపరీక్ష నిర్వహించింది. ఆ తర్వాత వాజ్పేయి సాహెబ్ ఇక్కడకు వచ్చి మాతో ఒప్పందం చేసుకున్నారు. కానీ మేము ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించాం.. అది మా తప్పు” అని ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఘటన తర్వాత ఈ ఘట్టానికి 26 ఏళ్లు పూర్తైన రోజే ఆయన మళ్లీ బాధ్యతలు తీసుకోవడం గమనార్హం..