Praneet Hanuman : నోటి దూ* ప్రణీత్‌కు.. ఇంత బ్యాగ్రౌండ్ ఉందా ?
మాటలు ఉన్నవి.. కమ్యూనికేట్ చేసుకునేందుకు ! నాలుక కదులుతుంది కదా అని... మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే.. తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నోటి దూలతో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.

After that, he earned a good name by working as a high official in various departments of the government. Praneet is the son of Arun Kumar.
మాటలు ఉన్నవి.. కమ్యూనికేట్ చేసుకునేందుకు ! నాలుక కదులుతుంది కదా అని… మేధావితనం ముసుగులో నానా చెత్త వాగితే.. తోలు తీసేస్తారు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా.. ప్రణీత్ హనుమంతు అనే యూట్యూబర్ నోటి దూలతో.. జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఏకంగా సీఎం వరకు ఈ వ్యవహారం వెళ్లింది. ఐతే ఈ ప్రవీణ్ హనుమంతు బ్యాక్‌గ్రౌండ్ తెలిసి ఇప్పుడు ప్రతీ ఒక్కరు షాక్ అవుతున్నారు. రోస్ట్ వీడియోస్ చేస్తూ ప్రణీత్ హనుమంతు పాపులర్ అయ్యాడు. ఐతే అమెరికాలో నివసించే తెలుగు ఫ్యామిలీ షేర్ చేసిన రీల్ మీద… తండ్రీ కుమార్తె బంధాన్ని అపహాస్యం చేస్తూ… ప్రణీత్ జోక్స్ వేశాడు. అతడి బ్యాచ్ హేయమైన, నీచమైన కామెంట్స్ చేశారు. అతడి వ్యాఖ్యలపై జనాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. హీరో సాయిధరమ్ తేజ్ అందరి కంటే ముందుగా రియాక్ట్ అయ్యాడు. అతడి మీద చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ, తెలంగాణ డీజీపీలు కూడా రియాక్ట్ అయ్యారు. మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్ సేన్.. ఇలా చాలామంది హీరోలు కూడా ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలను ఖండించారు. దీంతో క్షమించాలంటూ.. ప్రణీత్ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అవి ఎవరిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావంటూ.. చేతులెత్తేసి దండం పెట్టాడు. ఐతే వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ప్రణీత్.. ఇలాంటి దగుల్బాజీ పనిచేయడంపై.. నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ప్రణీత్ హనుమంతు తండ్రి పేరు అరుణ్ కుమార్… ఓ ఐఏఎస్ అధికారి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అరుణ్ కుమార్.. ఐఏఎస్ అధికారిగా ఏపీలోని పలు జిల్లాలకు కలెక్టర్‌గా పనిచేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గానూ అరుణ్ కుమార్ పనిచేశారు.
ఆ తర్వాత ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో ఉన్నతాధికారిగా పనిచేస్తూ మంచి పేరు సంపాదించారు. అరుణ్ కుమార్ పుత్రరత్నమే ప్రణీత్. కొంతకాలంగా యూట్యూబ్ వేదికగా రోస్ట్ వీడియోస్ చేస్తూ పాపులర్ అయ్యాడు. ప్రణీత్ హనుమంతు అన్నయ్య కూడా యూట్యూబర్. అతను స్టైలింగ్ టిప్స్ ఇస్తూ పాపులర్ అయ్యారు. హే జూడ్ ఛానల్‌ను ప్రణీత్ అన్న అజయ్ నడిపిస్తున్నాడు. ప్రణీత్ కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. సుధీర్ బాబు కథానాయకుడిగా వచ్చిన హరోం హరలో ప్రణీత్ హనుమంతు నటించాడు. తమిళనాడు ప్రాంతానికి చెందిన డాన్ తరహా పాత్ర పోషించాడు.