EX Minister, Mallanna : మల్లన్నపై మరో కేసు.. వదల బొమ్మాళి వదల..
తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిన తరువాత మిగతావాళ్ల పరిస్థితి ఏంటో గాని మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది.

తెలంగాణలో బీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోయిన తరువాత మిగతావాళ్ల పరిస్థితి ఏంటో గాని మాజీ మంత్రి మల్లారెడ్డి పరిస్థితి మాత్రం దారుణంగా తయారయ్యింది. ఒక ప్రాంబ్లం సాల్వ్ అయ్యింది అనుకునేలోపే మరో సమస్య మల్లన్నను వెంటాడుతోంది. రీసెంట్‌గానే అక్రమ కట్టడాలంటూ మల్లారెడ్డి సంస్థలకు సంబంధించిన కొన్ని బిల్డింగ్స్‌ను పడగొట్టారు మున్సిపల్ అధికారులు. ఈ షాక్ నుంచి మల్లా రెడ్డి తేరుకోకముందే.. మల్లారెడ్డిపై మరో కేసు నమోదైంది. బషీర్‌బాగ్‌లో మల్లారెడ్డి తన భూమి కబ్జా చేశాడంటూ ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దీంతో మల్లారెడ్డిపై ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బషీర్‌బాగ్‌లో ఉన్న 32 గుంటల స్థలానికి సంబంధించి.. మల్లారెడ్డి రాజశేఖర్ రెడ్డిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు పోలీసులు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రేవంత్ రెడ్డికి మల్లారెడ్డికి మధ్య ఎలాంటి వార్ నడిచిందో రాష్ట్రం మొత్తం చూసింది. పబ్లిక్ మీటింగ్స్‌లో తన పదవిని కూడా మర్చిపోయి రేవంత్ రెడ్డిని బూతులు తిట్టాడు మల్లారెడ్డి. కట్ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
మల్లారెడ్డి ఎవరినైతే తిట్టాడో ఆయన ముఖ్యమంత్రి సీట్‌లో కూర్చున్నాడు. రేవంత్ సీఎం అయ్యాడో లేదో మల్లారెడ్డి మీద అధికారుల దాడులు మొదలయ్యాయి. ఇప్పటికే ఓ కాలేజ్ బిల్డింగ్‌ను పడగొట్టేశారు అధికారులు. ఇప్పుడు మరో కేసు మల్లారెడ్డి కోసం రెడీ అయ్యింది. దీంతో మల్లారెడ్డి సామ్రాజ్యాన్ని కూల్చేవరకూ కాంగ్రెస్ ఊరుకునేలా లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరుసగా మల్లన్నను వెంటాడుతున్న ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయో చూడాలి.