TDP Nara Brahmani : నారా బ్రహ్మణికి టీడీపీ బాధ్యతలు అప్పజెబుతారా..?
టీడీపీ ఆవిర్భవించాక.. కనివినీ ఎరుగని సంక్షోభం. పార్టీ అధ్యక్షుడు స్వయంగా జైలుకెళ్లారు. కోర్టులో కూడా ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కాకుండా.. మరిన్ని కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం.. పెద్దలు అష్టదిగ్బంధనం చేశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
చంద్రబాబు అరెస్ట్ తర్వాత లోకేష్ ను కూడా జైలుకు పంపుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో బ్రహ్మణికి బాధ్యతలు అప్పచెప్పాలనే చర్చ టీడీపీలో బోరుగా సాగుతోంది. వారూ వీరూ కాకుండా.. టీడీపీ లో కీలక పాత్ర పోషిస్తున్న అయ్యన్న పాత్రుడే స్వయంగా ఈ కామెంట్ చేయడంతో ఇప్పుడు టీ వర్గాల్లోనే కాకుండా.. ఏపీ రాజకీయాల్లో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది.
పార్టీని నడిపించే నాయకుడు ఎవ్వరు..?
టీడీపీ ఆవిర్భవించాక.. కనివినీ ఎరుగని సంక్షోభం. పార్టీ అధ్యక్షుడు స్వయంగా జైలుకెళ్లారు. కోర్టులో కూడా ఎక్కడికక్కడే ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ కాకుండా.. మరిన్ని కేసులు కూడా తెర మీదకు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల వరకు చంద్రబాబు జైలు నుంచి బయటకు రాకుండా కట్టడి చేసే దిశగా ప్రభుత్వం.. పెద్దలు అష్టదిగ్బంధనం చేశారనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత లోకేష్ ప్రస్తుతం పార్టీని లీడ్ చేస్తున్నారు. అయితే వివిధ కేసులో లోకేష్ ను కూడా ముద్దాయిగా చేర్చడం.. లోకేష్ ను కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. చంద్రబాబునే కాకుండా.. లోకేష్ ను కూడా ఎన్నికల వరకు జైలు నుంచి బయటకు రారనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. దీంతో పార్టీని నడిపించే నాయకుడెవ్వరు..? ఎవరికి లీడ్ ఇస్తారు..? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఇదే తరహా చర్చ టీడీపీ వర్గాల్లో కూడా జరుగుతోంది. అక్కడ ఇక్కడ కాకుండా.. స్వయంగా లోకేష్ సమక్షంలోనే ఈ చర్చ జరిగినట్లు పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. ప్రచారం జరుగుతున్నట్టు లోకేష్ కూడా జైలుకు వెళ్తే.. బ్రహ్మణిని ముందుంచి నడిపిస్తామని.. పార్టీ బాధ్యతలు ఆమెకు అప్పజెబుదామని తానే లోకేష్ కు చెప్పానని అయ్యన్నే వెల్లడించారు. ఇది ఓ రకంగా రాజకీయ వర్గాల్లో సంచలనమైందనే చెప్పాలి.
అయ్యన్న చేసిన కామెంట్స్ ఏంటి..?
అయ్యన్నే స్వయంగా ఈ కామెంట్లు చేయడంతో పార్టీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారనే అంశంపై పార్టీ వర్గా చర్చ జరిగింది. దీనికి తగ్గట్టు బాలయ్య పార్టీ కార్యాలయానికి రావడం.. చంద్రబాబు సీట్లో కూర్చొవడం వంటి సీన్లతో పాటు.. తాను ముందుండి నడిపిస్తానని బాలయ్య ప్రకటించడం బాలయ్య లీడ్ రోల్ తీసుకోబోతున్నారా..? అనే చర్చ జరిగింది. ఇదే సందర్భంలో నందమూరి కుటుంబ ఆడపడుచులు.. నారా కోడళ్లు భువనేశ్వరి, బ్రహ్మణిల్లో ఎవరు బాధ్యతలు తీసుకుంటారనే చర్చ కూడా జరిగింది. యువగళం పాదయాత్రను అత్తా కోడళల్లో ఎవరో ఒకరు కంటిన్యూ చేస్తారని.. పార్టీని భుజాన వేసుకునేందుకు అత్తా కోడళ్లు కూడా మానసికంగా సిద్దమయ్యారనే ప్రచారం కూడా బాగా జరిగింది. అయితే ఇదంతా బయట జరుగుతున్న చర్చే తప్ప.. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని పార్టీ వర్గాలు వివిధ సందర్భాల్లో చెప్పారు. అయితే అవసరమైతే బ్రహ్మణికి పార్టీ బాధ్యతలు అప్పచెబుదామని.. బెంగ పెట్టుకోవడని నేరుగా లోకేష్ కే చెప్పేశానని అయ్యన్న చెప్పడంతో టీడీపీకి వెళ్లి లీడర్ ఎవరనే క్లారిటీ వచ్చేసినట్టు అయింది.
పెనమలూరు నుంచి పోటీ చేయనున్న బ్రహ్మణి..?
ఈ క్రమంలో బ్రహ్మణికి నాయకత్వ లక్షణాలు.. ఒకవేళ బ్రహ్మణి పోటీ చేయదలిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దిశగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. హెరిటేజ్ సంస్థ బాధ్యతలను బ్రహ్మణి టేకప్ చేసిన తర్వాత ఆ సంస్థను ముందుంచి నడిపించిన తీరుతో పాటు.. చంద్రబాబు జైలుకెళ్లిన తర్వాత ఒకట్రెండు సందర్భాల్లో ఆమె వ్యవహరించిన తీరు ఇప్పుడు చర్చగా మారాయి. అలాగే లోకేష్ జైలుకెళ్తారనే ప్రచారం మీద కూడా బ్రహ్మణి తనదైన స్టైల్లో స్పందించారని అంటున్నారు. తామేం భయపడడం లేదనే విషయాన్ని చెప్పడంతో పాటు.. పార్టీ కేడరులో కొంత మేర జోష్ నింపే విధంగా బ్రహ్మణి మాట్లాడిన తీరు ఇప్పుడు చర్చగా మారింది. ఇదే సందర్భంలో ఆమె పోటీ చేస్తారా..? చేస్తే ఎక్కడి నుంచి చేస్తారనే చర్చ కూడా జరుగుతోంది. పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ మేరకు కృష్ణా జిల్లా పెనమలూరు నుంచి పోటీ చేసే అవకాశం ఉందనే భావిస్తున్నారు. ఇటీవల లోకేష్ పాదయాత్ర చేసిన సందర్భంలో పెనమలూరు నియోజకవర్గంలో అద్భుతంగా స్పందన వచ్చింది. ఈ పరిస్థితుల్లో పెనమలూరు సెగ్మెంట్ అయితే ఆమెకు బాగా కలిసి వస్తుందని.. లెక్కలు వేస్తున్నాయి పార్టీ వర్గాలు.
ఈ చర్చలన్ని సీరియస్ కాదా..?
అయితే లోకేష్ దగ్గర జరిగిన చర్చ ఏదో పిచ్చాపాటిగా జరిగిన చర్చే తప్ప.. దానికి అంతగా ప్రాధాన్యత లేదని.. బయట జరుగుతున్న ప్రచారం గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో జరిగిన చర్చే తప్పు.. సీరియస్ డిస్కషన్ కాదంటున్నారు. అలాగని పార్టీ కష్టకాలంలో ఉంటే.. వారూ వీరూ అని లేకుండా అందరూ కలిసి వస్తారని.. దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన.. చెప్పాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ ఏదో ఛోటా మోటా లీడర్ కాకుండా.. అయ్యన్న లాంటి సీనియర్ ఈ కామెంట్ చేశారు కాబట్టే.. రాజకీయ వర్గాల్లో కానీ.. టీడీపీ వర్గాల్లో కానీ ఈ స్థాయి చర్చ జరుగుతోందంటున్నారు.