Salman Khan : ఇప్పటి వరకు తగ్గాను.. ఇకపై తగ్గనంటున్న సల్మాన్
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే స్టార్ హీరో అవుతాడు. వరుస ప్లాప్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్పుడు తీసుకునే డెసిషన్ ఆ హీరో కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు.

After Tiger Salman Khan said OK to do the film Liger Vs Pathan under the direction of Siddharth Anand Already the script is almost complete The pre-production work will start from November
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడే స్టార్ హీరో అవుతాడు. వరుస ప్లాప్స్ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా ప్పుడు తీసుకునే డెసిషన్ ఆ హీరో కెరీర్ ని బౌన్స్ బ్యాక్ చేస్తుంది. ప్రజెంట్ ఇదే విషయంలో సీరియస్ గా ఉన్నాడు సల్మాన్ ఖాన్. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేసుకుని ఆడియన్స్ లో అటెన్షన్ పెంచుతున్నాడు.
పఠాన్’ తర్వాత బాలీవుడ్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టైగర్-3’. ‘ఏక్ ది టైగర్’, ‘టైగర్ జిందాహై’ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఇది సీక్వెల్. యష్ రాజ్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ కావడంతో హూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న టైగర్ 3 నవంబర్ 10న ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేయడం గ్యారెంటీ అనే మాట గట్టిగా వినిపిస్తోంది.
టైగర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో ‘లైగర్ Vs పఠాన్’ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు సల్మాన్ ఖాన్. ఇప్పటికే స్క్రిప్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. నవంబర్ నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ కానుంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ మొదలు పెట్టి 2024 దీపావళికి రిలీజ్ చేసేలా ప్లానింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమా స్టార్ట్ కాకముందే మరో ప్రాజెక్ట్ చేయడానికి కండల వీరుడు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ తో ఇప్పటికే మూడు సినిమాలు చేశాడు సూరజ్ బర్జాత్యా. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన మైనే ప్యార్ కియా, హమ్ ఆప్కే హై కౌన్,ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాలు ప్రేక్షకుల్ని థ్రిల్ చేశాయి. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ ఈ కాంబో రిపీట్ కాబోతోంది.తాజాగా ఇదే విషయాన్ని ఒక మ్యాగజైన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో రివీల్ చేశాడు సూరజ్ బర్జాత్యా. ఇప్పటికే కథ చర్చలు పూర్తయ్యాయని..స్క్రిప్ట్ వర్క్ 80% ఫినిష్ రావడంతో వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లిందని తెలిపాడు. మొత్తానికి కిసీ కా భాయ్ కిసీ కి జాన్ ప్లాప్ తో అలార్ట్ అయిన సల్మాన్ ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్స్ ని సెలక్ట్ చేసుకుంటున్నాడు. కచ్చితంగా హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తున్నారు.