AP Deputy CM : వారాహి దీక్ష తర్వాత.. ఫార్మల్ లుక్‌లో కేక పుట్టించిన పవన్..
పవన్ కల్యాణ్.. స్టైల్ ఐకాన్ అంటారు ఫ్యాన్స్ అంతా ! ట్రెండ్ ఫాలో అవడం కాదు.. సెట్ చేస్తాను అన్నట్లు.. టాలీవుడ్ హీరోయిజానికి ప్రత్యేకమైన ఫ్యాషన్ ట్రెండ్ పరిచయం చేశారు పవన్. బాలు ప్యాంట్ గురించి, ఖుషీ బ్యాగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే.. పవన్ క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది మరి.

After Varahi Deeksha.. Pawan created a roar in formal look..
పవన్ కల్యాణ్.. స్టైల్ ఐకాన్ అంటారు ఫ్యాన్స్ అంతా ! ట్రెండ్ ఫాలో అవడం కాదు.. సెట్ చేస్తాను అన్నట్లు.. టాలీవుడ్ హీరోయిజానికి ప్రత్యేకమైన ఫ్యాషన్ ట్రెండ్ పరిచయం చేశారు పవన్. బాలు ప్యాంట్ గురించి, ఖుషీ బ్యాగ్ గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు అంటే.. పవన్ క్రియేట్ చేసిన ట్రెండ్ అలాంటిది మరి. రాజకీయాల్లోకి వచ్చాక.. సింగిల్ లుక్‌కు పరిమితం అయ్యారు పవన్. ఐతే ఇదంతా ఎలా ఉన్నా.. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్.. ఆ తర్వాత వారాహి దీక్ష చేపట్టారు. 40రోజులు ఆ దీక్షలోనే ఉన్న పవన్.. ఎక్కడికి వెళ్లి పసుపు రంగు దుస్తుల్లోనే కనిపించారు. అంబానీ ఇంట్లో పెళ్లికి కూడా.. వారాహి దీక్షా వస్త్రాల్లోనే కనిపించారు. ఐతే ఇప్పుడు పవన్ సింగపూర్ వెళ్లారు. భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ సెర్మనీకి అటెండ్ అయ్యారు. భార్యతో కలిసి విమానం ఎక్కేప్పుడు పవన్ లుక్.. ఇప్పుడు ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. సింపుల్ ఫార్మల్ లుక్‌లో కేక పుట్టించారు. ఇది నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఎన్నాళ్లకెన్నాళ్లకు పవన్‌ను.. మళ్లీ ఈ లుక్‌లో చూడడం అంటూ.. తెగ హడావుడి చేసేస్తున్నారు ఫ్యాన్స్. లైట్ బ్లూ షర్ట్.. బ్రౌన్ ప్యాంట్‌లో పవన్ స్టైలిషన్ వాక్‌ను.. ఎవరో క్లిక్‌మనిపించారు. ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయ్. ఇక అటు పవన్ భార్య గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంటున్న వీడియోని కూడా సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.