మళ్ళీ కింగ్ కోహ్లీనే పాపులర్ స్పోర్ట్స్ స్టార్స్ లో టాప్
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా... సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరుతెచ్చుకున్న కోహ్లీ ఫాలోయింగ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు విరాట్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదే లే.
మన దేశంలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా… సచిన్ తర్వాత రికార్డుల రారాజుగా పేరుతెచ్చుకున్న కోహ్లీ ఫాలోయింగ్ అయితే ఓ రేంజ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు విరాట్ క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గేదే లే… తాజాగా దేశంలోనే మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ జాబితాలో విరాట్ కోహ్లీ మరోసారి అగ్రస్థానంలో నిలిచాడు. ఆర్మాక్స్ సంస్థ ప్రకటించిన టాప్ 10 జాబితాలో కోహ్లీ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఆగస్ట్ నెలలో అత్యంత ఆదరణ కలిగిన టాప్ 10 ఆటగాళ్ల కోసం ఈ సంస్థ సర్వే నిర్వహించింది. టాప్ 10 లిస్టులో ఐదుగురు క్రికెటర్లే… మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రెండో స్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ మూడో ప్లేస్ లో నిలిచాడు.
ఇక సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో నాలుగో స్థానంలోనూ, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఐదో స్థానంలోనూ ఉన్నారు. ఇక అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ ఆరో స్థానంలో నిలిస్తే… భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా ఏడో స్థానంలో ఉన్నాడు. భారత ఫుట్‌బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రీ 8వ స్థానంలోనూ, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తొమ్మిదో స్థానంలోనూ ఉన్నారు. ఇక ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా 10వ స్థానంలో నిలిచాడు. కాగా భారత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా విరాట్ ఫాలోయింగ్ పెరుగుతూనే ఉంది. అలాగే అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పి ఐదేళ్ళు దాటినా కూడా ధోనీ క్రేజ్ అలానే ఉంది.