ఏం పీకుతున్నావ్… గంభీర్ కు అగార్కర్ క్లాస్

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో ప్రకంపనలు రేపుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కివీస్ భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అది కూడా అన్ని టెస్టుల్లోనూ టీమిండియాను నిలువరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 3, 2024 | 08:28 PMLast Updated on: Nov 03, 2024 | 8:28 PM

Agarkar Fire On Gambhir

న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవం భారత క్రికెట్ లో ప్రకంపనలు రేపుతోంది. ఎవ్వరూ ఊహించని విధంగా కివీస్ భారత గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అది కూడా అన్ని టెస్టుల్లోనూ టీమిండియాను నిలువరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనంతో కనిపించాడు. తాను కోచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇది తొలి ఘోరపరాజయం. పైగా సొంతగడ్డపై ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. తాజాగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గంభీర్ పై ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ముంబై టెస్టులో కివీస్ విజయం తర్వాత అగార్కర్ గ్రౌండ్ లో కనిపించాడు. నేరుగా కోచ్ గంభీర్ దగ్గరకు వెళ్ళి చాలాసేపు సీరియస్ గా మాట్లాడాడు. గంభీర్ కు అగార్కర్ క్లాస్ పీకినట్టు వీడియోల్లో కనిపించింది. మంచి జట్టునే ఎంపిక చేసినా కూడా ఫలితం ఇంత దారుణంగా రావడంపైనే సెలక్షన్ కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం.

అలాగే సిరీస్ సందర్భంగా జట్టు ఆటతీరు, కోచ్ గా తాను అనుసరించిన వ్యూహాలు వంటి వాటిపై అగార్కర్ సీరియస్ గా చర్చించినట్టు తెలుస్తోంది. నిజానికి న్యూజిలాండ్‌తో సిరీస్‌ ఆరంభం నుంచి భారత్ జట్టు వరుసగా తప్పులు చేస్తూనే ఉంది. బెంగళూరు టెస్టులో పేస్ పిచ్‌తో ప్రయోగం చేసి చతికిలపడింది. ఆ తర్వాత పుణె టెస్టులో స్పిన్‌ పిచ్‌‌తో ఉచ్చుని బిగించబోయి తానే చిక్కుకుంది. ఇక వాంఖడేలో ఆఖరి టెస్టులోనూ స్పిన్‌‌తో పడగొట్టబోయి భారత్ జట్టే బోల్తా కొట్టింది. ఈ మూడు టెస్టు ఓటములకి కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ని బాధ్యుడ్ని చేస్తున్న టీమిండియా అభిమానులు.. వెంటనే అతడ్ని బాధ్యతల నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే గంభీర్,అగర్కార్ మధ్య రోహిత్ శర్మ, కోహ్లీ పేలవ ఫామ్ కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. ఈ సిరీస్ లో వీరిద్దరూ దారుణంగా నిరాశపరిచారు. గత 10 ఇన్నింగ్స్ లలో కోహ్లీ 192 రన్స్ చేయగా… రోహిత్ 133 పరుగులే చేయగలిగాడు. అది కూడా సొంతగడ్డపైనే గత ఆరు ఇన్నింగ్స్ లు ఆడి ఫామ్ అందుకోలేకపోవడం చర్చనీయాంశమైంది. వీరి పేలవ ఫామ్ ఆసీస్ టూర్ కు ముందు టీమిండియాకు ఆందోళనగా మారింది. నిజానికి కివీస్ తో సిరీస్ లో పంత్ తప్పిస్తే మిగిలిన ఆటగాళ్ళెవ్వరూ పెద్దగా రాణించలేదు. ఇలాంటి ఆటతీరుతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం అసాధ్యమంటూ ఫ్యాన్స్ తేల్చేస్తున్నారు.