Agarwood: కిలో కోటి రూపాలయల వరకూ పలికే అరుదైన అగరు కలప గురించి తెలుసా..?

కిలో కోటి రూపాలయలు పలికే కలప మన దేశంలో పెరుగుతోంది. దీనికి అంతర్జాతీయంగా మంచి డిమాండు ఉంది. వీటిని అగరు వృక్షాలు అంటారు. దీనిని ఎందుకు ఉపయోగిస్తారు.? ఇంత డిమాండుకు గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 1, 2023 | 12:32 PMLast Updated on: Oct 01, 2023 | 12:34 PM

Agarwood Known As The Most Expensive Wood Has The Following Features And Benefits

మనకు తెలిసిన ఖరీదైన కలప చందనం, టేకు, ఎర్రచందనం. వీటిని అక్రమంగా తరలిస్తూ ఉంటారు కొందరు. మరి కొందరు ప్రభుత్వ ఆదేశాను సారంగా పెంచుకుంటూ ఉంటారు. వీటన్నింటికీ పక్కన నెట్టే ఖరీదైన కలప ఒకటి ఉంది. అదే అగర్ వుడ్. దీనికి అంతర్జాతీయ మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటుంది. బంగారం కంటే విలువైన కలప ఇది. ఎందుకు ఇంత విలువ అనే అనుమానం రావచ్చు. ఎందుకంటే దీని ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి.

వీటి ఉపయోగాలు – ధర

ఈ కలప ద్వారా జిగురును తీసి పరిమళ ద్రవ్యాలలో ఉపయోగిస్తారు. అలాగే కొన్ని సౌందర్య సాధనాలలో వినియోగిస్తారు. దీని నుంచి వచ్చే నూనెలో మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నట్లు చెబుతారు పరిశీలకులు. దీని నుంచి వచ్చే రసాన్ని అగరుబత్తీలు తయారీలో వాడుతారు. ప్రస్తుత కాలంలో ఈ వృక్షాలు పెద్ద ఎత్తున కోతక గురవడం మూలాన వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఈ కలపను విక్రయించడంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎర్రచందనం, చందనం వంటి విలువైన దుంగలను ఘనపుటడుగులలో లెక్కించి విక్రయిస్తారు. అయితే అగరు కలపను కిలోల ప్రకారం అమ్ముతూ ఉంటారు. కేజీ అగరు కలప అంతర్జాతీయ మార్కెట్లో లక్ష డాలర్లు ఉంటుంది. మన కరెన్సీ ప్రకారం రూ. 83 లక్షలు అనమాట. ఇందులో గ్రేడింగ్ ను బట్టి వీటి ధరలో మార్పులు ఉంటాయి.

ఈ దేశాల్లో దొరుకుతాయి..

మన దేశానికి సంబంధించిన వరకూ ఇవి ఉత్తర భారతదేశంలోని దట్టమైన అడవుల్లో ఉంటాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొన్న దేశాలతో పోలిస్తే చాలా తక్కువే. దీనిని మన దేశంలో ఔద్ కలప అంటారు. ఇవి చైనా, శ్రీలంక, ఇండోనేషియా, మలేసియా, లావోస్, కంబోడియా, థాయ్ లాండ్, పాపువా న్యూగినీ దేశాల్లోని దట్టమైన అరణ్యాల్లో లభిస్తాయి. వీటని అగరు వృక్షాలుగా పిలుస్తారు.

T.V.SRIKAR