Ahmadabad: సీజన్‌కి ఒకరిని మార్చేస్తున్నారు.. లివిన్ రిలేషన్‌షిప్స్‌పై అలహాబాద్ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు..
లివిన్ రిలేషన్లపై సంచలన తీర్పు వెలువరించిన కోర్ట్,

Ahmadabad High Court Shocking Comments on Living Relation Ship
లివిన్ రిలేషన్‌షిప్స్ ఈ మధ్య ఫ్యాషన్ అయ్యాయి. భార్య ఉండగా మరో అమ్మాయిని.. భర్త ఉండగా మరో అబ్బాయి మెయిన్‌టేన్ చేయడం అదో రేంజ్ అనుకుంటున్నారు చాలా మంది. వెస్ట్రన్ కల్చర్‌లో ఇదంతా ఓ భాగం అనే అపోహలో రోజు రోజుకూ దిగజారిపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాలు హత్యలు, ఆత్మహత్యలకు దారి తీస్తున్నాయి. ఇలాంటి లివిన్ రిలేషన్‌షిప్‌ల గురించి అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది.
ఇండియాలో ఎంతో పవిత్రంగా బలంగా ఉండే వివాహ వ్యవస్థను ఈ వివాహేతర సంబంధాలు దిగజారుస్తున్నాయంటూ అసహనం వ్యక్తం చేసింది. వివాహాలు ఇచ్చే భద్రత, సమాజ అమోదం, స్థిరమైన బంధాన్ని లివిన్ రిలేషన్ షిప్స్ ఇవ్వలేవని.. ఒక్కో సీజన్ కు ఒక్కో పార్ట్ నర్ ను మార్చే ఈ దరిద్రపు వ్యవస్థ ఆరోగ్యకరమైన సమాజానికి ఏమాత్రం మంచిది కాదని చెప్పింది. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇలాంటి చాలా సహజం. కానీ అక్కడ పరిస్థితి వేరే మన పరిస్థితి వేరు. మన సంస్కృతి సాంప్రదాయాలు వేరు. వాటి కారణంగానే ప్రపంచ దేశాల్లో భారత్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
విదేశీయులు ఎంతో గౌరవించే మన సాంప్రదాయాలను వివాహ వ్యవస్థను పిచ్చి పిచ్చి రిలేషన్స్‌తో దిగజారుస్తున్నారు కొందరు వ్యక్తులు. చట్ట ప్రకారం తప్పు కాకపోయినా.. ప్రతీ వ్యక్తి ఈ విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని అలహాబాద్ హైకోర్ట్ ఆభిప్రాయపడింది. రీసెంట్‌గా గుజరాత్‌కు చెందిన ఓ యువతి తనను తన ప్రియుడు మోసం చేశాడంటూ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసులో నిందితుడిని గతేడాది అరెస్ట్ కూడా చేశారు. రీసెంట్‌గా ఆ వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ వివాహ వ్యవస్థ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు.