అహాన్ శర్మ S/O రోహిత్ శర్మ, పేరు పెట్టిన హిట్ మ్యాన్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుక్కి పేరు పెట్టేశాడు. తనయుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశాడు. ఈ విషయాన్ని రోహిత్ సతీమణి రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన కొడుక్కి పేరు పెట్టేశాడు. తనయుడికి అహాన్ శర్మ అని నామకరణం చేశాడు. ఈ విషయాన్ని రోహిత్ సతీమణి రితికా సజ్దే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. డిసెంబర్ నెల వచ్చేసింది అంటూ క్రిస్‌మస్ శాంటా గెటప్‌లో ఉన్న ఓ ఫ్యామిలీ బొమ్మల ఫొటోను ఆమె షేర్ చేశారు. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ తరహాలోనే రోహిత్-రితికాలు కూడా తమ కొడుకు ఫొటోను ఇంకా విడుదల చేయలేదు. అహన్ కోసమే రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఆలస్యం వెల్లాడు. ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌కు రోహిత్ శర్మ దూరంగా ఉన్నాడు. రితిక సజ్దే ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు.