ఐపీఎల్ 18వ సీజన్ కు ముందు దేశవాళీ క్రికెట్ లో పలువురు యువ ఆటగాళ్ళు దుమ్మురేపుతున్నారు. విజయ్ హజారే టోర్నీలో పరుగుల వరద పారిస్తున్నారు. వరుస సెంచరీలతో పోటీ పడుతూ ఫ్రాంచైజీ ఓనర్లను ఖుషీ చేస్తున్నారు. తాజాగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ హిట్టర్ 105 బంతుల్లో 20 ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేశాడు. ప్రభాసిమ్రన్ సెంచరీతో పాటు, కెప్టెన్ అభిషేక్ శర్మ , రమణదీప్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో రాణించారు. ఫలితంగా పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్‌లో 400 పైగా స్కోర్ చేసింది. ఈ సెంచరీతో ప్రభసిమ్రాన్ సింగ్ విజయ్ హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ శతకాలు నమోదు చేశాడు. ముంబాయిపై 150, సౌరాష్ట్రపై 125 పరుగులతో ప్రభ్ సిమ్రన్ దుమ్మురేపాడు. వచ్చే సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ప్రభాసిమ్రాన్ సింగ్ ను 4 కోట్లకు అట్టిపెట్టుకుంది. అయితే ఫ్రాంచైజీ అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ వరుస సెంచరీలతో విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రభ్ సిమ్రాన్ సింగ్ ను రిటైన్ చేసుకున్నందుకు పంజాబ్ కో ఓనర్ ప్రీతిజింతా ఫుల్ జోష్ లో ఉంది. కాగా ప్రభ్ సిమ్రన్ సింగ్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 426 పరుగులు చేసింది. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ మూడు రోజుల క్రితం నెలకొల్పిన 424 పరుగుల రికార్డును మళ్ళీ పంజాబే బద్దలు కొట్టింది. దీంతో పంజాబ్ వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా 400 పరుగుల మార్క్ ను అందుకుంది.[embed]https://www.youtube.com/watch?v=7ayqdqibBPY[/embed]