Air India: అమెరికాకే ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన ఇండియా..!

టాటా ఇండస్ట్రీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 1868 నుంచే రకరకాల మార్కెట్ ఉత్పత్తులను తయారు చేస్తూ అంచెలంచలుగా ఎదుగుతూ వచ్చింది. జెసెట్ టాటా గ్రూప్స్ గా ఎదిగింది. ఇటీవల కోవిడ్ సమయంలో కూడా ప్రజలకు తనదైన సేవలను అందించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 16, 2023 | 12:51 PMLast Updated on: Feb 16, 2023 | 6:29 PM

Air India Big Deel With America And France

ఎయిర్ ఇండియా ఇది భారత్ లో జవహార్ నెహ్రూ కాలంలో తీసుకువచ్చిన విమానయాన సంస్థ. గతంలో ఎయిర్ ఇండియా తీవ్రమైన నష్టాల్లో ఉందని దీనిని ప్రైవేట్ పరం చేశారు. దీంతో ఎయిర్ ఇండియాను తిరిగి టాటా గ్రూప్ సంస్థలు తీసుకొని దీనికి మెరుగులు దిద్దేందుకు సన్నాహాలు చేశాయి. అందులో భాగంగా ఎయిర్ ఇండియా ఎయిర్ బస్ మధ్య భారీ ఒప్పందం కుదిరింది. టాటా గ్రూప్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా తన విస్తృతిని మరింత పెంచనుంది. దేశవిదేశాలకు మరిన్ని ఎయిర్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు మొదలు పెట్టింది. ప్రస్తుతం అధికారికంగా వెల్లడించిన దానిప్రకారం 470 విమానాల కొనుగోలుకు ఫ్రాన్స్, అమెరికాతో ఎప్పందం కుదుర్చుకుంది. ఇందులో ఫ్రాన్స్ ఎయిర్ సంస్థ 250 విమానాలు, అమెరికాలోని బోయింగ్ నుంచి 220 విమానాలను సరఫరా అవుతాయి. వీటి మొత్తం విలువ 80బిలియన్ డాలర్లు. అంటే భారత్ లెక్కల ప్రకారం 6లక్షలా 40వేల కోట్లకు పైగానే ఉంటుంది.

చాలా కాలం తరువాత భారీ ఎప్పందం:
ఈ ఆర్డర్‌లో 40 A350 ఎయిర్‌బస్ లు, 20 బోయింగ్ 787లతో పాటూ 10 బోయింగ్ 777-9s వైడ్‌బాడీ విమానాలు ఉన్నాయి. చిన్నపరిమాణంలో 210 ఎయిర్‌బస్ A320, 321 నియోస్, 190 బోయింగ్ 737 MAX సింగిల్ యాసిల్ విమానాలు ఉన్నాయి. A350 విమానం రోల్స్ రాయిస్ ఇంజిన్‌ల ద్వారానైనా లేకపోతే B777, 787లు GE ఏరోస్పేస్ నుండి ఇంజిన్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. అన్ని సింగిల్ యాసిల్ లో ప్రయాణించే విమానాలు CFM ఇంటర్నేషనల్ ఇంజిన్‌ల ద్వారా శక్తిని పొందుతాయి. 2006లో 68 బోయింగ్, 43 ఎయిర్‌బస్ విమానాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు ఎయిర్‌లైన్ నుండి వచ్చిన ఆర్ఢర్ చివరి ఆర్డర్ గా చెబుతారు. ఈ స్థాయిలో ఒప్పందాలు జరగడం అనేది సాధారణమైన అంశం కాదు. ఎందుకంటే ఈసంస్థ చివరిసారిగా 17 సంవత్సరాల క్రితం విమానాల కోసం ఆర్డర్ చేసింది. వాటిని టాటా సన్స్‌కు విక్రయించిన తర్వాత ఇంతటి స్థాయిలో కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి.

లేఖ సారాంశం:
ఆధునిక విమానాలను కొనుగోలు చేసేందుకు ఎయిర్ ఇండియా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది. ఈ సందర్భంగా టాటాసన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ శ్రీ ఎన్ చంద్రశేఖరన్ మాట్లాడుతూ “ఎయిర్ ఇండియా భద్రత, కస్టమర్ సర్వీస్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, నెట్‌వర్క్ మరియు మానవ వనరులలో పెద్దగా అభివృద్ది చెందిందన్నారు. ప్రపంచస్థాయి ప్రయాణాలను అందించాలనే ఉద్దేశ్యంతో దీనిని ప్రతిపాదించామన్నారు. దీనివల్ల గ్లోబల్ నెట్వర్క్ ను విస్తరించవచ్చని పేర్కొన్నారు. దీనిద్వారా భారతీయ విమానయాన నిపుణులకు అవసరమైన ఉపాధి అవకాశాలు అందుతాయని తెలిపారు. అత్యంత వేగమైన ప్రయాణ సర్వీసులకు ఇది ఉత్ప్రేరకంగా మారుతుందని వివరించారు. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లలో 2023చివరినాటికి కొన్నింటిని అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో అన్ని విమానప్రయాణాలను 2025నాటికి అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు రచించామన్నారు. ప్రయాణీకుల సౌకర్యార్థం విమానంలోపలి సీట్లను కూడా మార్పులు చేస్తున్నట్లు ఈ లేఖలో తెలిపారు. అద్భుతమైన సేవలను అందించడం ప్రధమ లక్ష్యం అయితే తక్కువ ధరకే ప్రయాణాన్ని కల్పించడం రెండవ లక్ష్యంగా చేసుకొని వీటిని ఏర్పాటు చేసున్నామని తెలిపారు. లెజెండరీ జంషట్ రతన్ టాటాచే స్థాపించబడిన ఎయిర్ ఇండియా భారతదేశ విమానయాన రంగానికి మార్గదర్శకంగా నిలిచింది. మొదటి విమానం అక్టోబర్ 15, 1932లో గగన తలంలోకి రెక్కలు కట్టుకు విహరించిందని పేర్కొన్నారు. అతి తక్కువ కాలంలోనే USA, కెనడా, UK, యూరప్, ఫార్-ఈస్ట్, సౌత్- అంతటా నెట్‌వర్క్‌తో ఒక ప్రధాన అంతర్జాతీయ ఎయిర్‌లైన్‌గా అవతరించింది. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా మరియు గల్ఫ్. ఎయిర్ ఇండియా అతిపెద్ద గ్లోబల్ ఎయిర్‌లైన్ కన్సార్టియం స్టార్ అలయన్స్‌లో సభ్యత్వాన్ని సాధించిందని పేర్కొన్నారు. 69 సంవత్సరాల పాటూ ప్రభుత్వయాన సంస్థగా సేవలందించి మళ్లీ తిరిగి 2022నుంచి టాటా గ్రూప్ ద్వారా వినియోగంలోకి వచ్చిందని తెలిపారు. దీని మేనేజ్మెంట్ బాధ్యతలు విహాన్ చేపట్టారని రాసుకొచ్చారు. ఇతని సారథ్యంలో కస్టమర్ ప్రతిపాదన, విశ్వసనీయతతోపాటూ సమయపాలన, పనితీరును మెరుగుపరచడం వంటివి మెరుగుపడ్డాయి.

చారిత్రాత్మక ఘట్టం:
ఈ కొనుగోలు 44 రాష్ట్రాలలో 1 మిలియన్ అమెరికన్ ఉద్యోగాలకు ఉపాధి ఇస్తుంది. ఇందులో పనిచేయడానికి నాలుగు సంవత్సరాల కళాశాల డిగ్రీ అవసరం లేదని అధ్యక్షుడు జో బిడెన్ చెప్పారు. “ఈ ప్రకటన U.S.-భారత్ ఆర్థిక భాగస్వామ్య బలాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రధానమంత్రి మోడీతో కలిసి, ప్రపంచ సవాళ్లను మనం ఎదుర్కొంటూనే ఉన్నందున, మనందరికీ మరింత సురక్షితమైన, సంపన్నమైన భవిష్యత్తును సృష్టించడం కోసం మేము మా భాగస్వామ్యాన్ని మరింత లోతుగా తీసుకెళ్లడానికి కృషిచేస్తున్నామని ఈసంస్థ తెలిపింది. పైన తెలిపిన రకరకాల విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు టాటా సన్స్ ఛైర్మన్ నటరాజన్, చంద్రశేఖరన్ లతో పాటూ ఈ ఒప్పందానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటూ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌లు వీడియోకాన్ఫరెన్స్‌లో తెలిపారు. మోడీ, మాక్రాన్ ఈ ఒప్పందాన్ని ప్రశంసించారు, ప్రపంచ ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఈ రెండు దేశాలు ప్రపంచానికి ఒక సంకేతమిస్తాయని తెలిపారు. విమానయాన రంగంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్‌ అవతరించబోతోందని మోదీ అన్నారు. రాబోయే 15 సంవత్సరాలలో, భారతదేశానికి 2,000 కంటే ఎక్కువ విమానాలు అవసరమవుతాయని అంచనా వేశారు. “ఈ రోజు తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం రేపు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడంలో సహాయపడుతుంది” అని ఆయన అన్నారు. మిస్టర్. మాక్రాన్ ఈ ఒప్పందాన్ని భారత్, ఫ్రాన్స్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో “కొత్త విజయం”గా పేర్కొన్నారు. ఇప్పటికే ఎయిరిండియా, బోయింగ్ మధ్య సత్సంబంధాలు ఉన్నప్పటికీ ఈ మెగా ఎయిర్ వేస్ ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా ఇరుదేశాల బంధం మరింత బలంగా పెనవేసుకుందన్నారు.

ఉపాధి కల్పన:
ఈ మూడుదేశాల త్రైపాక్షిక ల్యాండ్‌మార్క్-ఎయిర్ ఇండియా-బోయింగ్ ఒప్పందం అత్యధిక ఉద్యోగాలను కల్పిస్తుందని U.S. ప్రెసిడెంట్ జో బిడెన్ ప్రకటించారు. U.S.లోని 44 రాష్ట్రాలలో 1 మిలియన్ ఉద్యోగాలను సృష్టిస్తుంది అంచనా వేశారు. ఈ విజయం కేవలం అమెరికా ఆర్థికవ్యవస్థకే కాకుండా దేశంలోని కార్మిక, వాణిజ్య, దౌత్య పరంగా మరింత ముందుకు దూసుకెళ్తుందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఈ ఒప్పందం ద్వారా సృష్టించబడే ఉద్యోగాల సంఖ్యతో అమెరికా అత్యున్నత స్థాయిలో ఎదుగుతుంది. అదే సందర్భంగా ఉద్యోగ అవకాశాలను అందించే దేశంగా భారత్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖస్తుంది. అందరికీ ఉపాధినిచ్చే పెద్దన్న దేశం అమెరికాకే ఉపాధి అవకాశాలను అందించే కీలక ఒప్పందాన్ని భారత్ ఏర్పరుచుకుంది. ఈ ఒప్పందం వల్ల మనకు భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ప్రస్తుతం అమెరికాకు డబుల్ ధమాకా లభించినట్లు అవుతుంది.

 

 

T.V.SRIKAR