Aiswarya Divorce : ఐశ్వర్య-అభిషేక్ విడిపోయినట్టే.. కూతురు ఎవరి దగ్గర అంటే !
ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత... అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది.
ముంబైలో అనంత్ అంబానీ పెళ్ళి తర్వాత… అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ జంట విడాకుల సంగతి హాట్ టాపిక్ అయింది. అసలు అంబానీ ఇంట్లో పెళ్ళి దగ్గర నుంచే ఈ రూమర్ బాగా స్ప్రెడ్ అయింది. నిజంగా విడిపోయారా… రూమరేనా… అంటే బాలీవుడ్ వర్గాలు కూడా ఐశ్యర్య-అభిషేక్ డైవోర్స్ ని అన్ అఫీషియల్ గా కన్ఫమ్ చేస్తున్నాయి.
అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ తమ 17యేళ్ళ పెళ్ళి బంధానికి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. ధూమ్ 2 షూటింగ్ లో అభిషేక్ తో ప్రేమలో పడింది ఐశ్వర్య. 2007 జనవరిలో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. 2011లో ఈ జంటకి ఆరాధ్య పుట్టింది. జనరల్ గా సినీ సెలబ్రిటీల పెళ్ళిళ్ళు అంటే… అవి ఎన్నో యేళ్ళు కంటిన్యూ అవ్వవు అనే రూమర్ ఉంటుంది. కానీ అభిషేక్ – ఐశ్వర్య నిన్న మొన్నటిదాకా కలసి ఉండటంతో… వాళ్ళ కాపురం అన్యోన్యంగా సాగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఈమధ్యే వాళ్ళ బంధం తెగినట్టు బాలీవుడ్ లో రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత అంబానీ ఇంట్లో పెళ్ళితో అది నిజమేని తేలింది. దేశంలోనే అత్యంత కాస్ట్ లీగా జరిగిన ఈ పెళ్లికి అమితాబ్ కుటుంబంతో కలసి వచ్చారు అభిషేక్. ఐశ్వర్య మాత్రం తన కూతురు ఆరాధ్యతో కలసి విడిగా రావడం సంచలనంగా మారింది.
ఇదొక్కటే కాదు… ఈమధ్యే ముంబైలో అమితాబ్ ఇల్లు జల్సా నుంచి ఐశ్వర్యరాయ్ తన తల్లి ఇంటికి వెళ్లిపోవడం మీడియా కెమెరాల్లో చిక్కింది. ఐశ్యర్య కొంత కాలంగా జల్సాలో కాకుండా పక్కనే మరో ఇంట్లో ఉంటున్నట్టు బయటపడింది. అంటే మొన్నటిదాకా దాకా వత్సా రెసిడెన్సీలో ఉన్న ఐశ్వర్య…. ఆ ఇల్లు కూడా ఖాళీ చేసి ముంబైలో తన తల్లి దగ్గరకు వెళ్ళినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఐశ్వర్య, అభిషేక్ అధికారికంగా విడాకులు తీసుకోబోతున్నట్టు కన్ఫమ్ గా చెబుతున్నారు. మరికొన్ని రోజుల్లోనే వాళ్ళ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ వస్తుందని బాలీవుడ్ తోపాటు నేషనల్ మీడియా చెబుతోంది. అభిషేక్, ఐశ్వర్య విడాకుల కోసం ఇప్పటికే లీగల్ గా ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. కుమార్తె ఆరాధ్య మాత్రం బచ్చన్ ఫ్యామిలీలో ఉండేలా నిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. కానీ ప్రస్తుతం తన దగ్గరే ఉన్న ఆరాధ్యను అమితాబ్ ఇంటికి పంపడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా అనేది డౌట్ గా ఉంది.