ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత మెంటార్ అజయ్ జడేజాతో కాంట్రాక్ట్ పొడిగించుకోలేదు. ఈ మెగా టోర్నీ కోసం తమ జట్టు మెంటార్‌గా పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం యూనిస్ ఖాన్‌ను ఏసీబీ నియమించింది. ఈ విషయాన్నిఏసీబీ అధికారికంగా బుధవారం ప్రకటించింది. యూనిస్ ఖాన్ గతంలో 2022లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అజయ్ జడేజాతో మార్గదర్శకత్వంలో అఫ్గానిస్తాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచింది. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, పాకిస్తాన్, శ్రీలంక వంటి జట్లను ఓడించి సంచలనం సృష్టించింది. టీ ట్వంటీ వరల్డ్ కప్ లో సైతం అదరగొట్టింది. ఈ ప్రదర్శనలో జడేజా పాత్ర కీలకమనే చెప్పాలి. అయితే ఈ సారి మాత్రం జడేజాను తప్పించి యూనిస్ ఖాన్ ను నియమించుకుంది.[embed]https://www.youtube.com/watch?v=djACbWpowdo[/embed]